telugu navyamedia
రాజకీయ

దేశవ్యాప్తంగా ప్రారంభమైన ఉపఎన్నికల ఓట్ల లెక్కింపు..

దేశవ్యాప్తంగా అక్టోబరు 30న ఉప ఎన్నికలు జరిగిన 13 రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతమైన దాద్రా మరియు నగర్ హవేలీలో ఉన్న మూడు లోక్‌సభ మరియు 29 అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది.

దాద్రానగర్ హావేలీ, హిమాచల్‌ప్రదేశ్‌లోని మండి, మధ్యప్రదేశ్‌లోని ఖాంద్వా నియోజకవర్గాల్లో నిర్వహించిన లోక్‌సభ ఉపఎన్నికలకు ఓట్ల లెక్కింపు మొదలైంది.

అసోం (5), బంగాల్​ (4), మధ్యప్రదేశ్‌, మేఘాలయ, హిమాచల్​ప్రదేశ్​లలో 3 చొప్పున అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉపఎన్నికలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది.

బిహార్‌, కర్ణాటక, రాజస్థాన్ రాష్ట్రాల్లో 2 చొప్పున అసెంబ్లీ స్థానాల్లో జరిగిన ఉపఎన్నికలకు ఓట్ల లెక్కింపు జరుగుతోంది.

తెలంగాణ, ఏపీ, మహారాష్ట్ర, హరియాణా, మిజోరం రాష్ట్రాల్లో ఒక్కో అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉపఎన్నికలకు లెక్కింపు ప్రారంభమైంది. ఉత్కంఠను రేపుతున్నఈ ఉప ఎన్నిక ఫలితాలు మరికొన్ని గంటల్లో తేలనుంది.

Related posts