telugu navyamedia
రాశి ఫలాలు

అక్టోబర్ 13 రాశి ఫలాలు

మేషం: ఆర్థికంగా బాగుంటుంది. వ్యాపారులకు అనుకూలం. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. స్థిరాస్తి కొనుగోలుకు ప్రయత్నాలు చేస్తారు. బంధు మిత్రులను కలుసుకుంటారు.

వృషభం: ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి. చేపట్టిన పనుల్లో విఘ్నాలు ఎదురవుతాయి. ఇంటా బయటా ఒత్తిడి అధికమవుతుంది. ప్రయాణాలకు అవకాశం. కీలక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ఖర్చులను అదుపుచేయాలి.

మిథునం: ఆర్థికంగా బాగుంటుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మీరు అనుకున్నది సాధిస్తారు.వివాదాలకు దూరంగా ఉండండి. ఉద్యోగులకు అదనపు బాధ్యతలతో ఒత్తిడి పెరుగుతుంది.

కర్కాటకం: ఉద్యోగులకు ఉన్నతికి అవకాశం. అధికారుల ప్రశంసలు అందుకుంటారు. వృత్తి వ్యాపారాల్లో కలిసి వస్తుంది. సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. ఖర్చులు పెరుగుతాయి. పెద్దలను కలుసుకుంటారు.

సింహం: ఆర్థికంగా పర్వాలేదు, ఉద్యోగాల్లో వారికి ఉన్నతికి అవకాశం, సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా చాలావరకు పూర్తిచేస్తారు. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి.

కన్య: ఆర్థికంగా నిలకడగా ఉంటుంది. ఉద్యోగులకు శ్రమకు తగ్గ ఫలితం లభిస్తుంది. అప్పులు తీర్చే ప్రయత్నం చేస్తారు. కుటుంబ సభ్యుల సలహాలు పాటించండి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.

తుల: ఆర్థికంగా బాగుంటుంది. వ్యాపారులకు అనుకూలం. ఉద్యోగులకు తోటి వారి సహాయం అందుతుంది. వాయిదా పడుతూవస్తున్న పనులు ఓ కొలిక్కి వస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు. శుభవార్తలు వింటారు. బ్యాంకు వ్యవహారాలలో జాగ్రత్త,

వృశ్చికం: ఆర్థికంగా పర్వాలేదు. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు, వ్యాపారులకు మిశ్రమ ఫలితాలు, వాహనం కొనుగోలుకు ప్రయత్నాలు చేస్తారు. వివాదాలకు పోవద్దు, కుటుంబ సభ్యులతో సఖ్యతగా ఉండండి. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి.

ధనస్సు: ఆర్థికంగా కలిసివస్తుంది. స్థిరాస్తి కొనుగోలుకు ప్రయత్నం చేస్తారు. చేపట్టిన పనులలో స్వల్ప ఆటంకాలకు సూచనలున్నాయి. ఉద్యోగులకు ఒత్తిడి అధికమవుతుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి. శుభవార్తలు వింటారు. ఎవరికీ హామీలు ఉండొద్దు.

మకరం: ఆర్థికంగా బాగుంటుంది. ఉద్యోగులకు ఉన్నతికి అవకాశం. మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. చేపట్టిన పనుల్లో అడ్డంకులు ఎదురైనా విజయవంతంగా పూర్తిచేస్తారు. కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. శుభవార్తలు వింటారు.

కుంభం: ఆదాయంతో పాటు ఖర్చులు పెరుగుతాయి. ఉద్యోగులకు పని ఒత్తిడి అధికమవుతుంది. శ్రమకు తగ్గ ఫలితం లభిస్తుంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. సన్నిహితుల సహకారం అందుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.

మీనం: ఆదాయం బాగుంటుంది. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. కుటుంబ సభ్యుల సలహాలు పాటించండి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం. శుభవార్తలు వింటారు. అప్పులు తీరుస్తారు. ఖర్చులను అదుపుచేసుకోవాలి, బ్యాంకు వ్యవహారాలలో జాగ్రత్త.

 

Related posts