telugu navyamedia
సామాజిక

ప‌చ్చ‌ క‌ర్పూరానికి అంత శ‌క్తి ఉందా..? ఇలా చేశారంటే..?

దేవాల‌యాల్లో.. హిందువుల ఇళ్లల్లో క‌ర్పూరాన్ని వాడ‌తారు. దేవాల‌యాల్లో ప్ర‌సాదాల్లో, కొన్ని ర‌కాల వంట‌ల్లో వాడ‌తారు. చాలా మందికి తెలియ‌దు..దానిలో ఎన్ని లాభాలు ఉన్నాయ‌ని..అవి ఏంటో తెలుసుకుందాం..

ఇంట్లోని దుష్ట‌శ‌క్తుల‌ను తొల‌గించుకోవ‌డం కోసం ప‌చ్చ క‌ర్పూరాన్ని వాడ‌టం మంచిది. ప‌చ్చ క‌ర్పూరం నుంచి వ‌చ్చే సువాస‌న ద్వారా ఇంట్లో శ్రీల‌క్ష్మీ దేవి నివాసం ఉంటుంద‌ని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.

దేవుని ప‌టాల ముందు ముఖ్యంగా ల‌క్ష్మీదేవి ముందు గాజు పాత్ర‌లో నీటిని పోసి ప‌చ్చ‌క‌ర్పూరాన్ని అందులో వేసి..ప‌సుపును చిటికెడు చేర్చి ఉంచాలి. ఆ నీటిని రోజూ లేదా రెండు రోజుల‌కు ఓ సారి మారుస్తూ ఉండాలి. ఇలా చేస్తే ఆష్టైశ్వ‌ర్యాలు చేకూరుతాయి.

Vastu Gyan: Lighting camphor at home destroys negative energy | NewsTrack English 1

సంప‌ద‌ను ఆక‌ర్షించే శ‌క్తి ప‌చ్చ‌క‌ర్పూరానికి ఉంది. ప‌చ్చ క‌ర్పూరాన్ని ఓ ప‌సుపు వ‌స్ర్తంలో మూట‌లా క‌ట్టుకుని..ఇంటికి కుబేర స్థానంలో ఉంచి ధూప‌మేస్తూ వ‌స్తే..ఆర్థిక ఇబ్బందులు తొల‌గిపోతాయి.

ఈ ప‌చ్చ క‌ర్పూరాన్ని ఇంటి ప్ర‌ధాన గుమ్మానికి క‌ట్ట‌డం, పూజ‌గ‌దిలో ఉంచి పూజించ‌డం ద్వారా మాన‌సిక ప్ర‌శాంత‌త చేకూరుతుంది. ప‌చ్చ క‌ర్పూరం ఓ ముక్క‌ను పేప‌ర్లో మ‌డ‌త పెట్టి..ప‌ర్సులో ఉంచుకుంటే..ధ‌నాదాయం పెరుగుతుంది.

ఇంట్లో జ‌రిగే శుభ‌కార్యాల‌కు ప‌చ్చ క‌ర్పూరాన్ని వాడ‌డం మంచిది. అలాగే వ్యాపారం చేప‌టే్ట ప్రాంతాల్లోనూ, బీరువాల్లో ప‌చ్చ‌క‌ర్పూరాన్ని ఉంచ‌డం ద్వారా ఈతిబాధ‌లుండ‌వ‌ని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.

Related posts