telugu navyamedia
రాశి ఫలాలు

ఆగస్టు 11 (బుధ వారం) రాశి ఫలాలు

మేషం : అనుకున్న పనులు పూర్తిచేస్తారు. ధనలాభం ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో అభివృద్ధి కనిపిస్తుంది. స్థిరమైన ఆలోచనలతో మంచి ఫలితాలు పొందుతారు. వ్యాపారంలో లాభాలు ఆర్జిస్తారు. వితరణ కార్యక్రమంలో పాల్గొంటారు. కుటుంబంలో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి, తొందరపాటు చర్యలకు పాల్పడవద్దు.

వృషభం: ఉద్యోగంలో అదనపు బాధ్యతలు ఉంటాయి. బంధువుల నుంచి చికాకులు ఎదురవుతాయి. ముఖ్యమైన పనుల్లో జాగ్రత్తలు అవసరం. చేపట్టిన పనుల్లో ఆటంకాలు వచ్చినా అధిగమించే ప్రయత్నం చేస్తారు. కుటుంబ సభ్యుల సలహాలు, సూచనలు తీసుకోండి. ఆరోగ్యం జాగ్రత్త. వ్యాపారులకు అన్ని విధాలా అనుకూలం.

మిథునం: ఆదాయ వనరులు పెరిగే అవకాశం ఉంది. మీ రంగంలో అనుకున్నది సాధిస్తారు. ఉద్యోగంలో సానుకూల మార్పులుంటాయి. వృత్తి, వ్యాపారాల్లో మరింత శ్రద్ధ పెంచాలి. అతికష్టంమీద కొన్ని పనులు పూర్తవుతాయి. బంధుమిత్రుల సహాయ సహకారాలు ఉంటాయి. స్థిరాస్తి కొనుగోలుకు ప్రయత్నం చేస్తారు. గౌరవ మర్యాదలు పెరుగుతాయి.

కర్కాటకం: ఉద్యోగంలో అధికారుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా బాగుంటుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. చాలాకాలంగా ఎదురు చూస్తున్న పని ఒకటి పూర్తవుతుంది. శుభవార్తలు వింటారు. నిరుద్యోగులకు మంచి సంస్థలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. వివాహ సంబంధాలకు అనుకూలం. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం.

సింహం: వృత్తి, వ్యాపారాల్లో ఆర్థికంగా పురోగతి ఉంది. పట్టుదలతో కొన్ని పెండింగ్ పనులు పూర్తి చేస్తారు. అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. ఆదాయం నిలకడగా ఉంటుంది ఖర్చులు బాగా పెరుగుతాయి. స్నేహితులతో విభేదాలు రాకుండా జాగ్రత్త పడండి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది.

కన్య: ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. ఎంతో ప్రయత్నం మీద ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. మీకు రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. అనవసర ఖర్చులు పెరుగుతాయి. నిరుద్యోగులకు దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం. కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయాలు తీసుకోండి.

తుల: వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో అభివృద్ధికి సంబంధించి అనుకూలంగా ఉంది. బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే కలిసి వస్తాయి. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. మీచుట్టూ సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో ఆదాయం కొద్దిగా తగ్గి ఖర్చులు పెరిగే సూచనలున్నాయి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం.

వృశ్చికం: ఆర్థిక విషయాల్లో మంచి ఫలితాలు ఉన్నాయి. ఉద్యోగ జీవితం నిలకడగా ఉంటుంది. వ్యాపారపరంగా అప్రమత్తంగా ఉండాలి. సమాజంలో గుర్తింపు లభిస్తుంది. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. తలపెట్టిన పనులు పూర్తిచేస్తారు. అనుకోకుండా ఆర్థిక సమస్య ఒకటి పరిష్కారమవుతుంది. అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి.

ధనుస్సు: ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. శుభవార్తలు వింటారు. వృత్తి, వ్యాపారాల్లో ఆశించినంతగా లాభాలు పెరుగుతాయి. ఉద్యోగంలో శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. తలపెట్టిన కార్యక్రమంలో విఘ్నాలు ఎదురవుతాయి. అనవసర ఖర్చులు తగ్గించుకోవాలి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.

మకరం: వృత్తి, వ్యాపారాల్లో ఆర్థికాభివృద్ధికి అవకాశం ఉంది. ఉద్యోగ జీవితం ఆశాజనకంగా ఉంటుంది. మంచి నిర్ణయాలు తీసుకుని పనులు మొదలు పెట్టండి. ఇబ్బందులెదురైనా సమర్థంగా ఎదుర్కొంటారు. ప్రయాణాలు ఫలిస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కొన్ని బాధ్యతలను సమర్థవంతంగా పూర్తి చేస్తారు. శుభవార్తలు వింటారు.

కుంభం: ఉద్యోగ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. అదనపు బాధ్యతలతో శ్రమ ఉంటుంది. మీకు అప్పగించిన బాధ్యతలను సమర్ధంగా పూర్తిచేస్తారు. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నా ఇతరులకు సహాయం చేస్తారు. బంధువుల నుంచి సహాయం లభిస్తుంది. కుటుంబ సభ్యుల సలహాలు బాగా పనిచేస్తాయి. కీలక నిర్ణయాలు తీసుకుంటారు.

మీనం: ఆదాయం, ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతుంది. ఉద్యోగంలో బాధ్యతలు పెరుగుతాయి. పెళ్లి ప్రయత్నాలు కలిసి వస్తాయి. మీ ప్రతిభకు ప్రశంసలు అందుకుంటారు. గట్టి సంకల్ప బలంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. కొత్త అవకాశాలు వస్తాయి. మొదలుపెట్టిన పనుల్లో శుభ ఫలితాలు ఉంటాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి.

Related posts