telugu navyamedia
సినిమా వార్తలు

దర్శకుడు శ్రీను వైట్ల ఇంట్లో విషాదం..

టాలీవుడ్ లో మ‌రో విషాదం నెల‌కొంది. ప్రముఖ దర్శకుడు శ్రీనువైట్లకు పితృవియోగం కలిగింది. ఆయన తండ్రి వైట్ల కృష్ణారావు (83) ఆదివారం తెల్లవారుజామున 4 గంటలకు కన్నుమూశారు. స్వస్థలం తూర్పుగోదావరి జిల్లా కందులపాలెంలో నివసిస్తున్న కృష్ణారావు గత కొన్నిరోజుల నుంచి అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్నారు.

Tragedy In Tollywood, Famous Director Srinu Vaitla Father Vaitla Krishnarao Passes Away | Srinu Vaitla: టాలీవుడ్‌లో విషాదం... ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు శ్రీను వైట్లకు పితృవియోగం

ఈ క్రమంలోనే తెల్లవారుజామున ఆయన తుదిశ్వాస విడిచారు. కృష్ణారావుకు శ్రీను వైట్లతో పాటు ఒక కుమార్తె ఉన్నారు. కృష్ణారావు మృతితో శ్రీనువైట్ల కుటుంబం తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది.

ఈ విషయం తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు శ్రీను వైట్లకు ఫోన్‌ చేసి సంతాపం తెలుపుతున్నారు. కాగా.. కృష్ణారావు అంత్యక్రియలు ఈ రోజు తూర్పుగోదావరి జిల్లాలోని కందులపాలెంటో జరగనున్నట్లు బంధువులు పేర్కొంటున్నారు.

Related posts