telugu navyamedia
రాశి ఫలాలు

న‌వంబ‌ర్ 18, గురువారం రాశిఫ‌లాలు…

మేష రాశి..

వృత్తి ఉద్యోగాల్లో గణనీయమైన పురోభివృద్ధి సాధిస్తారు.ధనాదాయ మార్గాలు పెరుగుతాయి. దీర్ఘకాలిక ఋణసమస్యల నుంచి బయటపడతారు. వృత్తి వ్యాపారాల ప్రారంభానికి అవరోధాలు అధిగమిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. కీలక వ్యవహారాలలో ముఖ్య నిర్ణయాలు చేసి మంచి ఫలితాలు సాధిస్తారు. నూతన ఉద్యోగ యోగం ఉంది. నూతన కార్యక్రమాలను కుటుంబ సభ్యుల అంగీకారం తర్వాతే ప్రారంభించండి.

వృషభ రాశి..

మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. చేపట్టిన వ్యవహారాలు సకాలంలో పూర్తవుతాయి. ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి సంతానానికి ఉన్నత విద్యావకాశాలు లభిస్తాయి. దూరప్రాంత బంధువుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. వృత్తి, ఉద్యోగ సమస్యలను మనోధైర్యంతో అదిగమిస్తారు. స్త్రీలకు నరాలు, ఎముకలు, దంతాలకు సంబంధించిన చికాకులు ఎదుర్కోవలసి వస్తుంది.

మిధున రాశి..

ఆర్థికవ్యవహారాలు లాభసాటిగా సాగుతాయి. విదేశీ యత్నాల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కుంటారు. స్థిరాస్తి వివాదాలకు పరిష్కార మార్గాలు చూస్తారు. కొన్ని రంగాల వారికి అనుకూల వాతావరణం ఉంటుంది. గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. బంధుమిత్రుల నుంచి కీలక సమాచారం సేకరిస్తారు. విందు,వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు.

కర్కాటక రాశి..

మిత్రులతో వివాదాలను పరిష్కారమౌతాయి. స్థిరాస్తి కొనుగోలు యత్నాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు కొంత బాధిస్తాయి. ధైర్యంతో తీసుకున్న నిర్ణయాలు గొప్ప ఫలితాన్ని ఇస్తాయి. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది.

సింహ రాశి..

బంధు మిత్రులతో గృహమున ఆనందంగా గడుపుతారు. దైవదీక్షలు స్వీకరిస్తారు. వృత్తి,ఉద్యోగ,వ్యాపార రంగాల్లో మంచి ఫలితాలు అందుకుంటారు. భూ సంబంధిత వివాదాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. కొన్ని వ్యవహారాలలో సోదరుల నుండి ఆశించిన సహాయం లభిస్తుంది.

కన్య రాశి..

సంఘంలో విశేషమైన గౌరవ మర్యాదలు పొందుతారు. విదేశీవస్తువులపై ఆసక్తి పెరుగుతుంది. బంధు మిత్రుల ఆదరణ పెరుగుతుంది. చేపట్టిన పనులలో జాప్యం కలిగినప్పటికీ నిదానంగా పూర్తిచేస్తారు. వ్యాపారాలలో స్వల్ప ధనలాభ సూచనలు ఉన్నవి. కీలక వ్యవహారాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి.

తుల రాశి..

ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. కుటుంబ సభ్యుల నుంచి ధన సహాయం లభిస్తుంది. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. భవిష్యత్తు ప్రణాళికలను రచిస్తారు. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. స్త్రీలు ఉపవాసాలు, శ్రమాధిక్యత కారణంగా స్వల్ప అస్వస్థతకు గురవుతారు.

వృశ్చిక రాశి..

నిరుద్యోగులకు నూతన అవకాశములు పొందుతారు. బంధువుల కోసం ధనం ఖర్చు చేస్తారు. ఆర్థిక పరిస్థితి మరింత ఉత్సాహంగా సాగుతుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి వృత్తి వ్యాపారాలలో ఆశించిన లాభాలు పొందుతారు. ఉద్యోగులకు పని ఒత్తిడి పెరుగుతుంది. కొన్ని సంఘటనలు బాధ కలిగిస్తాయి.

ధనస్సు రాశి..

బ్యాంకు పనుల్లో ఏకాగ్రత వహించండి. డాక్టర్లు శస్త్రచికిత్సలో విజయాన్ని సాధిస్తారు. దూరప్రాంతాల బంధువుల నుండి ఆహ్వానాలు అందుతాయి. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. అధికారుల అనుగ్రహంతో కొన్ని పనులలో విజయం సాదిస్తారు. బంధుమిత్రులను కలిసి సంతోషంగా గడుపుతారు.

మకర రాశి..

శారీరక శ్రమ పెరుగుతుంది. కొందరి ప్రవర్తనాశైలి మిమ్మల్ని బాధిస్తుంది.. దైవ సేవా కార్యక్రమాలకు హాజరు అవుతారు. వ్యాపార పరంగా నూతన అవకాశాలు జార విడవకుండా చూసుకోవాలి. నూతన వస్తు వాహన లాభాలు పొందుతారు. ఉద్యోగంలో స్వంత ఆలోచనలతో ముందుకు సాగడం మంచిది.ఉద్యోగస్తులకు విధినిర్వహణలో తోటివారి సహాయ సహకారాలు లభిస్తాయి.

కుంభ రాశి..

వృత్తి, వ్యాపారాలలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు. ఒక వ్యవహారంలో సమయానుకూలంగా స్పందించి అందరి ప్రశంసలు పొందుతారు. ముఖ్యమైన వ్యవహారాలలో ఆకస్మిక విజయం పొందుతారు. శుభకార్యాలకు కుటుంబ సభ్యులతో హాజరావుతారు. నూతన గృహ కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. వృధా ప్రయాణాలు చేయవలసి రావచ్చు.దైవకార్యాలపట్ల ఆసక్తి నెలకొంటుంది.

మీన రాశి..

వృత్తుల వారికి సంఘంలో మంచి గుర్తింపు, తగిన ప్రతిఫలం లభిస్తాయి. ఆత్మీయుల నుండి ఊహించని ఆహ్వానాలు అందుతాయి. క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి. కొన్ని వ్యవహారాలలో ధైర్యంగా వ్యవహరించి అందరి ప్రశంసలు అందుకుంటారు.

 

Related posts