telugu navyamedia
ఆంధ్ర వార్తలు

వచ్చే సంవత్సరంనుంచే కొత్త విద్యావిధానం..

వచ్చే విద్యాసంవత్సరంనుంచి కొత్త విద్యావిధానాన్ని అమలుచేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయంతీసుకుంది. విద్యాశాఖ ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సమీక్షించారు. విద్యావిధానంలో సమూల మార్పులతో సత్ఫలితాలను సాధించేందుకు ఉద్ధేశించిన కార్యాచరణ ప్రణాళికను అమలు చేయాలని సూచించారు.

Andhra Pradesh splits schools into 6 segments to roll out NEP- The New Indian Express

ప్రభుత్వ విద్యాసంస్థల్లో మెరుగైన ఫలితాలు సాధించడంతోపాటు… పాఠశాలలకు మౌలిక సదుపాయాల కల్పనకు నిధులకు కొరతే లేదని పేర్కొన్నారు. లెర్న్‌ టు లెర్న్‌ కాన్సెప్ట్‌ను పాఠ్యప్రణాళికలో తీసుకురావాలని కోరారు.ఇంటర్నెట్, ఎలక్ట్రానిక్‌ పరికరాల ద్వారా వివిధ అంశాలను నేర్చుకోవడం, వాటిని ఇతరులకు నేర్పించడం లాంటి కాన్సెప్ట్‌ను పిల్లలకు నేర్పించాలని అధికారులకు సూచించారు.

Related posts