telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

తెలుగు రాష్ట్రాల మధ్య .. స్థానికత గడువు పెంపు.. గెజిట్‌ జారీ…

ap map

తెలుగురాష్ట్రాలలో స్థానికత కోసం దరఖాస్తు చేసుకునే సమయాన్ని మరింత పెంచారు. గతంలో మూడేళ్లు సమయం ఇచ్చి… ఆ తర్వాత ఐదేళ్లకు పెంచగా… ఇప్పుడు దాన్ని ఏడేళ్లకు పెంచుతూ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ గెజిట్‌ నోటిఫికేషన్‌ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి పట్ల సానుకూలంగా స్పందించిన కేంద్రం.. ఈ మేరకు రాష్ట్రపతికి సిఫార్సు చేసింది. దీంతో..ఆయన ఆమోదంతో కేంద్ర హోం శాఖ గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ. ఈ ఉత్తర్వులు ద్వారా తెలంగాణ నుంచి వచ్చేవారు 2021 జూన్‌ 1వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. రాష్ట్ర విభజన కారణంగా అప్పటి వరకు ఉన్న కామన్ స్టేటస్ ఏపీ..తెలంగాణ గా విడిపోయింది. దీని కారణంగా ఏపీలో మూలాలు ఉన్న వారు విద్య..ఉపాధి కోసం హైదరాబాద్ కు వెళ్లటంతో వారికి తెలంగాణ స్థానికత దక్కింది. అందులో ఏపీలో పని చేసే ఉద్యోగుల పిల్లలు..ఇప్పుడు ఏపీకి తిరిగి రావాలనుకుంటున్న వారి కోసం ప్రభుత్వం తిరిగి వచ్చే వారికి స్థానికత ఇచ్చేందుకు విభజన తరువాత అంగీకరించింది.

అప్పట్లో పెద్దగా అక్కడ నుండి ఏపీకి రావాటానికి విద్యార్దులు..ఉద్యోగులు సుముఖత వ్యక్తం చేయలేదు. దీంతో..ఆ సమయాన్ని పెంచుతూ వస్తున్నారు. దీని ద్వారా ఇప్పుడు తెలంగాణ నుండి ఏపీకి వచ్చే వారికి లోకల్ స్టేటస్ దక్కనుంది. అందుకు ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. అందులో భాగంగానే గడువును సైతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. తెలంగాణ నుంచి ఏపీకి వచ్చేవారు స్థానిక హోదా(లోకల్‌ స్టేటస్‌) పొందడానికి గడువును కేంద్ర ప్రభుత్వం మరో రెండేళ్లు పొడిగించింది. కేంద్ర హోంశాఖ విడుదల చేసిన గెజిట్‌ నోటిఫికేషన్‌ ప్రకారం తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు వచ్చేవారికి 2021 జూన్‌ ఒకటో తేదీ వరకూ స్థానిక హోదా పొందడానికి అవకాశం లభించనుంది. తెలంగాణలో నివాసం ఉంటూ ఆంధ్రప్రదేశ్‌కు వచ్చేవారికి ఇక్కడ లోకల్‌ స్టేటస్‌ పొందడానికి కేంద్ర ప్రభుత్వం మొదట మూడేళ్లు గడువు ఇచ్చింది. ఇందుకోసం రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 370(డి)లోని ప్రెసిడెన్షియల్‌ ఆర్డర్‌ను రాష్ట్రపతి ఆమోదంతో సవరించింది. దీనిప్రకారం రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ రోజైన 2014 జూన్‌ 2 నుంచి 2017 జూన్‌ 1 వరకు లోకల్‌ స్టేటస్‌ సర్టిఫికెట్లు పొందవచ్చని 2016 జూన్‌ 16న కేంద్ర హోంశాఖ గెజిట్‌ నోటిఫికేషన్‌ ఇచ్చింది.

Related posts