telugu navyamedia
రాశి ఫలాలు

జ‌న‌వ‌రి 4, మంగ‌ళ‌వారం రాశి ఫలాలు

మేషరాశి..

ప్రయాణాలు చేసేట‌ప్పుడు తెలియ‌ని వ్యక్తులతో మితంగా సంభాషించ‌డం మంచిది కాదు. ఆస్తుల విషయంలో అగ్రిమెంట్లు చేసుకుంటారు. కుటుంబంలో సమస్యలు కొలిక్కి వ‌స్తాయి. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది.వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగాలలో ఉద్యోగాలలో గందరగోళంగా ఉంటుంది.

వృషభరాశి..

వ్యవహారాలలో అవాంతరాలు. కుటుంబసభ్యులతో విభేదాలు ఏర్ప‌డ‌తాయి. కొత్తరుణయత్నాలు. కుటుంబబాధ్యతలు అధికమవుతాయి. ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు. అరోగ్యం విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టాలి. వ్యాపారాలు సాధారణంగా ఉంటాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. విద్యార్థులకు చ‌దువులో ఏకాగ్రత లోపించవచ్చు.

మిథునరాశి..

నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వచ్చే సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయి. ప్రయాణాలు రద్దు అవుతాయి. బంధువులతో గొడ‌వ‌లు ఏర్ప‌డ‌తాయి . ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. బ‌య‌ట దొరికే ఆహారం తిన‌డం వ‌ల్ల స‌మ‌స్య‌లు త‌లెత్తే అవ‌కాశ‌లు క‌నిపిస్తున్నాయి. ఉద్యోగాలలో పై అధికారులు నుంచి ఒత్తిడులు ఏర్ప‌డ‌తాయి.

కర్కాటకరాశి..

కొత్త పనులకు శ్రీకారం చుడ‌తారు. ఉద్యోగులకు మంచి అవకాశాలు లభిస్తాయి. ఇష్టమైన వారితో ఎక్కువ సమయం గడుపుతారు. ఆత్మీయులతో మనస్పర్ధలు తొలగుతాయి. దూరప్రయాణాలు చేస్తారు. ప్రతి విషయంలోను జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. దైవకార్యాక్ర‌మాల్లో పాల్గొంటారు. వ్యాపారాల్లో ఉండే వివాదాలు పరిష్కరించుకుంటారు.

సింహరాశి..

ఆర్ధిక పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందుతాయి.ఉపాధ్యాయులకు ఒత్తిడి, పనిభారం అధికమవుతాయి. సంఘంలో గౌరవప్రతిష్ఠలు పెరుగుతాయి. కుటుంబపరంగా నిర్ణయాలు తీసుకుంటారు. వాహనయోగం క‌లుగుతుంది. జీవిత భాగస్వామి సహాయంతో ఆర్థిక పరిస్థితి కాస్త‌ మెరుగుప‌డుతుంది.

కన్యరాశి..

ఆరోగ్యం మంద‌గిస్తుంది. వ్యాపారాల్లో ఒడిదుడుకులు ఏర్ప‌డ‌తాయి. ద‌గ్గ‌ర బంధువులు నుంచి ఒత్తిడులు అధిక‌మ‌వుతాయి. అనుకోని ప్రయాణాలు చేస్తారు. ముఖ్యమైన వ్యవహారాలు ముందుకు సాగవు.. ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు. సంఘంలో కీర్తి ప్ర‌తిష్ఠ‌లు పెరుగుతాయి. దైవ‌ద‌ర్శ‌నాలు చేసుకుంటారు.

తులరాశి..

బంధువులతో త‌గాదాలు ఏర్ప‌డ‌తాయి. ఆర్థిక ఇబ్బందులు తొలుగుతాయి. శ్రమ తప్పదు. పనుల్లో అవాంతరాలు. అనుకోని ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సాదాసీదాగా ఉంటాయి. పెద్దలతో చ‌ర్చించి నిర్ణ‌యాలు తీసుకోవ‌డం మంచిది. విద్యార్థినుల నిర్లక్ష్యం వ‌ల్ల పెద్ద‌ల‌తో మాట‌లు ప‌డే సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయి. ధ‌నం అధికంగా ఖ‌ర్చు అవుతుంది.

వృశ్చికరాశి..

ముఖ్య‌మైన వారితో పరిచయాలు మరింత పెరుగుతాయి. ఆస్తుల విక్రయాలు లాభిస్తాయి. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. పనుల్లో విజయం సాధిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి. ఆర్థిక ఇబ్బందులు ఎక్కువుతాయి. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు.

ధనుస్సురాశి..

కుటుంబసభ్యుల నుంచి సమస్యలు. కొన్ని పనులు మధ్యలో వాయిదా. శ్రమ తప్పదు. ప్రయాణాలలో అవాంతరాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు నిదానిస్తాయి. చిన్ననాటి మిత్రుల‌ను క‌లుసుకుంటారు. రాజకీయాల్లో వారికి కార్యకర్తల వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు.ఆర్థిక లాభాలు పొందుతారు. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు.

మకరరాశి..

బంధువులు నుంచి శుభవార్తలు వింటారు. స్త్రీలకు విలాస వస్తువులు, అలంకరణల పట్ల మక్కువ పెరుగుతుంది. నూతన ఉద్యోగయోగం ఏర్ప‌డుతుంది. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. కొన్ని వ్యవహారాలు ఉత్సాహంగా సాగుతాయి. దైవచింతన ఎక్కువ‌వుతుంది.

కుంభరాశి..

అన‌వ‌స‌ర ఖర్చులను త‌గ్గించ‌డం మంచిది. వ్యవహారాలలో అవాంతరాలు ఏర్ప‌డ‌తాయి. ప్రయాణాలు వాయిదా వేస్తారు. ఇంటాబయటా సమస్యలు. ఆలయాలు సందర్శిస్తారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. ఉద్యోగాలలో అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు.

మీనరాశి..

సమయానికి నిద‌పోవ‌డం ఆరోగ్యానికి మంచిది. అధికంగా ఆలోచించి టెన్షన్‌కు గురికావ‌డం ఇబ్బందులు ప‌డాల్సి వ‌స్తుంది. వ్యతిరేకులను కూడా ఆకట్టుకుంటారు. ఆహ్వానాలు అందుతాయి. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. మీరు ఏదైనా ఆస్తిని కొనుగోలు చేయాలనుకునే మీ కల నెర‌వేరుతుంది.

Related posts