telugu navyamedia
సినిమా వార్తలు

బేబి బంప్‌తో క‌నిపించిన కాజ‌ల్‌ – ఫోటోస్ వైరల్

లక్ష్మీ కళ్యాణం సినిమాతో టాలీవుడ్‌లోకి హీరోయిన్‏గా ఎంట్రీ ఇచ్చిన కాజ‌ల్‌..ఆ త‌రువాత వ‌చ్చిన చంద‌మామ సినిమాతో త‌న‌కంటూ ఒక ప్ర‌త్యేక‌మైన గుర్తింపు ఏర్ప‌రుచుకుంది..ఆ త‌రువాత వెన‌క్కి తిరిగి చూసుకోకుండా టాలీవుడ్ స్టార్ హీరోలు అంద‌రితో జ‌త క‌ట్టింది..

Kajal Aggarwal to marry businessman Gautam Kitchlu? | Tamil Movie News -  Times of India

ఇటీవ‌ల ఈ అందాల చందమామ తన చిన్ననాటి స్నేహతుడు గౌతమ్ కిచ్లు ని పెళ్ళి చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది. అయితే పెళ్లి తర్వాత కూడా మెగాస్టార్ చిరంజీవి మాస్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆచార్య సినిమాలో హీరోయిన్‌గా నటించింది కాజ‌ల్. ఇటీవ‌లే ఈ షూటింగ్ కూడా పూర్తయ్యింది.

Kajal Agarwal flaunts her Baby bump in new pictures! - Tamil News -  IndiaGlitz.com

 

అయితే ..త్వరలోనే తల్లి కాబోతున్న విష‌యాన్ని న్యూ ఇయర్‌ సందర్భంగా కౌజల్‌ భర్త గౌతమ్‌ కిచ్లు ఈ విషయాన్ని అఫీషియల్‌గా అనౌన్స్‌ చేశాడు. ఈ కొత్త సంవత్సరంలో నీ రాక కోసం ఎదురు చూస్తున్నామంటూ గర్భవతి మహిళ ఎమోజీని క్యాప్షన్‌తో ఓ ఫొటోను షేర్‌ చేశాడు. దీంతో కాజల్ ప్రెగ్నెంట్ విషయంలో క్లారిటీ ఇచ్చేశారు.

Kajal Aggarwal glows as she shows off her baby bump in these latest  pictures | Telugu Movie News - Times of India

భర్త ప్రకటన అనంతరం కాజల్‌ తొలిసారిగా బేబీ బంప్‌తో ఉన్న ఫోటోను షేర్‌ చేసింది. భర్తతో దిగిన ఓ ఫోటోను షేర్‌చేస్తూ 2022 అంటూ లవ్‌ సింబల్‌ను యాడ్‌ చేసింది. మ‌రో ఫోటోలో కాజల్ తన భర్త గౌతమ్ కిచ్లుతో సముద్రం ఒడ్డున నడుస్తున్న ఫోటోస్ షేర్ చేసుకుంది. ప్రతి విజయవంతమైన వ్యక్తి వెనక అతని భార్య ఉంది.. ఫోటోస్ తీయడం అంటూ క్యాప్షన్ ఇచ్చింది.

కాజల్ షేర్ చేసిన ఫోటోలో కాజల్‌ బేబీ బంప్‌ స్పష్టంగా కనిపిస్తుంది. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. దీంతో అంద‌రూ శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నారు..

Related posts