telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

రానా, మిహికా మరో ఫోటో వైరల్

rana

ఎవరూ ఊహించని షాక్ ఇచ్చాడు రానా దగ్గుబాటి. అనూహ్యంగా తన పెళ్లి వార్తను ప్రకటించి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేశాడు. ప్రముఖ డిజైనర్ మిహీకా బజాజ్ తన ప్రేమకి ఓకే చెప్పిందని ఆమెతో కలిసి దిగిన ఫోటోని రానా తన ట్విట్టర్ ద్వారా షేర్ చేశాడు. దీంతో సెలబ్రిటీలందరు ఆయనకు శుభాకాంక్షలు అందించారు. చిరంజీవి సైతం రానా, మిహికాను దీవిస్తూ ట్వీట్ చేశారు. అయితే తాజాగా రానా-మిహీకాకి సంబంధించిన మరో ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇందులో ఇద్దరు నవ్వుతూ ఫోటోలకి ఫోజిచ్చినట్టు కనిపిస్తుంది. రానా కుర్చీలో కూర్చుండగా… మిహికా సోఫాకు వాలి నిల్చున్న ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో రానా మిహికాకు సంబంధించిన కొత్త ఫోటోలు చూసి ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఇక రానా అభిమానులు తమ హీరోకు కాబోయే భార్య గురించి అప్పుడే ఆరాలు తీయడం మొదలు పెట్టారు. ఇక మిహికా విషయానికి వస్తే ఆమె పక్కా హైదరాబాది. పుట్టింది పెరిగింది అంతా భాగ్యనగరంలోనే. బంటీ- సురేష్ బజాజ్ దంపతుల గారాల పట్టి. చెల్సియా యూనివర్శిటీలో ఇంటీరియర్ డిజైన్ లో మాస్టర్స్ డిగ్రీ చేసింది. ఆమె ఇంటీరియర్ డిజైన్ .. డెకార్ బిజినెస్ స్పెషలిస్ట్. డ్యూ డ్రాప్ డిజైన్ స్టూడియోను మిహీక స్వయంగా నడుపుతున్నారు. ఈ సంస్థ వివాహాలు .. ఇతర కార్యక్రమాలను కూడా ప్లాన్ చేస్తుంది. అతి త్వరలోనే వీరి వివాహం జరగనున్నట్టు తెలుస్తుంది.

Related posts