telugu navyamedia
రాశి ఫలాలు

డిసెంబర్‌ 22, బుధవారం రాశిఫలాలు

మేషరాశి..

వ్యవహారాలలో స్వల్ప ఆటంకాలు ఎదుర‌వుతాయి. కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. ధనం ఖ‌ర్చు అవుతుంది. ఆర్థిక విషయాలు నిరాశ కలిగిస్తాయి. స్త్రీలకు విలాస వస్తువులపట్ల ఆసక్తి పెరుగుతుంది. స్నేహితులతో వివాదాలు ఏర్ప‌డ‌తాయి. వ్యాపారాల్లో అంత‌గా క‌లిసిరావు.

వృషభరాశి..

పనుల్లో విజయం సాధిస్తారు. వంక‌రబుద్ధితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. కుటుంబ‌ శుభకార్యాలలో పాల్గొంటారు. చిన్న నాటి మిత్రులను క‌లుస్తారు. నూతన బాధ్యతలను అంగీకరించే ముందు జాగ్రత్త ఆలోచించండి. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాలు నిల‌క‌డ‌గా సాగుతాయి.

మిథునరాశి..

కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. మిత్రులతో విభేదాలు ఏర్ప‌డ‌తాయి. వాహనం నడుపునపుడు జాగ్రత్త అవసరం. పనుల్లో జాప్యం. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. రాబడికి తగినట్లు ఖ‌ర్చులు చేయ‌డం మంచిది. విలువైన వస్తువులు చేజారిపోయే ఆస్కారం ఉంది.

కర్కాటకరాశి..

కొత్తగా పరిచయమైన వ్యక్తులతో సన్నిహితంగా ఉండటం మందిదికాదు. మిత్రుల సహకారం అందుతుంది. ఆకస్మిక ధనలాభం పొందుతారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్ప‌డ‌తాయి. సంఘంలో గౌరవమర్యాదలు ఏర్ప‌డ‌తాయి. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూల‌మైన కాలం క‌లిసివ‌స్తుంది. ఆస్తి వివాదాలు కొలిక్కి వ‌స్తాయి. మొహమాటం వల్ల ఇబ్బందులు ప‌డ‌తారు జాగ్ర‌త్త‌.

సింహరాశి..

బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. ముఖ్య‌మైన‌ పనులు వాయిదా వేస్తారు. కుటుంబంలో బాధ్యతలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలలో నిరుత్సాహ ప‌రుస్తాయి. మీ అభిరుచులకు తగిన విధంగా కుటుంబ సభ్యులు మసలుకుంటారు. దైవకార్యక్ర‌మాల్లో పాల్గొంటారు.

కన్యరాశి..

నిరుద్యోగుల ఆశలు నెరవేరతాయి. అభివృద్ధికి సంబంధించిన వ్యవహారాలలో మీకు అనుకూల నిర్ణయాలు వస్తాయి. ఆర్థికాభివృద్ధి మెరుగుప‌డుతుంది. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఇంటిలో శుభకార్యాలు చేస్తారు. వస్తులాభాలు ఉంటాయి. వృత్తి, వ్యాపారాలు నిల‌క‌డ‌గా సాగుతాయి. ప్రభుత్వోద్యోగులకు విధి నిర్వహణలో ఇబ్బందులెదురవుతాయి.

తులరాశి..

ఏకాగ్రత లోపించటం వల్ల విద్యార్థినులు ఒత్తిడి, ఆందోళనలకు గురవుతారు. తలపెట్టిన పనులు నిర్విఘ్నంగా పూర్తి చేస్తారు. కొత్త విషయాలు తెలుసుకుంటారు. ఇంటాబయటా ప్రోత్సాహం ల‌భిస్తుంది. ఆస్తి విషయంలో అగ్రిమెంట్లు చేసుకుంటారు. వృత్తి, వ్యాపారాలు సంతృప్తికరంగా ఉంటాయి. దైవ ద‌ర్శ‌నాలు చేయ‌డం మంచిది.

వృశ్చికరాశి..

వ‌స్తు, వాహ‌న‌యోగం పొందుతారు. దైవసేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. పనులలో తొందరపాటు మంచిది కాదు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే ఉంటుంది. రుణయత్నాలు చేస్తారు. అనారోగ్య సూచనలు కనిపిస్తున్నాయి. వ్యాపార, ఉద్యోగాలలో కొద్దిపాటి మార్పులు చేర్పులు ఉంటాయి. విద్యార్థులకు ఒత్తిడులు ఏర్ప‌డ‌తాయి.

ధనుస్సురాశి..

ప్రారంభించబోయే పనుల్లో శ్రమ పెరుగుతుంది కానీ లాభం ఉండ‌దు. బంధువులతో విభేదాలు రాకుండా చూసుకోవాలి. వైద్య రంగాల వారికి చికాకులు, పనుల్లో కొద్దిపాటి ఆటంకాలు ఎదుర‌వుతాయి. ఖ‌ర్చులు ఎక్కువుగా ఉంటాయి. శ్రమ పడ్డా ఫలితం ఉండదు. దైవదర్శనాలు చేస్తారు.

మకరరాశి..

అనవసర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. కుటుంబ వాతావరణం అంత అనుకూలంగా ఉండకపోవచ్చు. ప్రముఖులతో పరిచయాలు ఏర్ప‌డ‌తాయి. స‌మాజంలో గౌరవమర్యాదలు అందుతాయి. విద్యార్థులకు అనుకూల ఫలితాలు ఉంటాయి.  స్త్రీలకు బంధు వర్గాలతో సఖ్యత నెలకొంటుంది. వృత్తి, వ్యాపారాలు మంద‌కొడిగా సాగుతాయి.

కుంభరాశి..

ఉమ్మడి వ్యాపారాలు సంతృప్తినిస్తాయి. కుటుంబ శుభకార్యాలలో పాల్గొంటారు. మొండి బాకీలు వసూలవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలించ‌వు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వృత్తి, వ్యాపారాలలో మంద‌కొడిగా సాగుతాయి విద్యార్థులకు లక్ష్యం పట్ల ఏకాగ్రత ఉండ‌డం మంచిది.

మీనరాశి..

రాజకీయ నాయకులు విదేశీ పర్యటనల కోసం చేసే యత్నాల్లో అడ్డంకులు తొలగిపోతాయి. బంధువుల నుంచి ఒత్తిడులు ఏర్ప‌డ‌తాయి. ఇంటాబయటా ఇబ్బందులు ఎదుర్కొవ‌ల‌సి వ‌స్తుంది. ఆరోగ్యభంగం . శ్రమకు త‌గ్గ ఫ‌లితం ఉండ‌దు. ఆస్తి వివాదాలు కొలిక్కి వ‌స్తాయి. చేపట్టిన పనులు సజావుగా పూర్తి చేస్తారు.

 

 

Related posts