ప్రముఖ దర్శకుడు..పి చంద్ర శేఖర్ రెడ్డి ఈ రోజు ఉదయం 8.30 లకు చెన్నై లోమృతి చెందారు.ఆయన మృతిపై పలువురు ప్రముఖులు సంతాపం తెలియజేశారు.
పి.చంద్రశేఖర్ రెడ్డి గారు నాకు వ్యక్తిగతంగా మరియు మా కుటుంబానికి అత్యంత సన్నిహితంగా కలిసిపోయే ఆప్తులు అని టాలీవుడ్ సినీయర్ నటుడు ఘట్టమనేని కృష్ణ తెలిపారు.
ఆయన దర్శత్వంలో వచ్చిన తొలిచిత్రం లో హీరోగా నేను నటించాను.తొలిచిత్రం అత్తలు _ కోడళ్ళు, రెండవచిత్రం అనురాధ కూడా నేనే హీరో, మా ఇద్దరి కాంబినేషన్ లో 23 చిత్రాలు వచ్చాయి, వాటిలో ఇల్లు_ ఇల్లాలు, కొత్త కాపురం, పాడిపంటలు,నాపిలుపే ప్రభంజనం మంచి హిట్స్, మా పద్మాలయ అనుబంధ సంస్థలో ఆయన డైరెక్టర్ గా కూడా వ్యవహరించారు.
మేము చాలా ఆప్తులైన వ్యక్తిని కోల్పోయాం, వారి కుటుంబానికి మా సానుభూతి, ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుడు ని ప్రార్థిస్తూ… ఘట్టమనేని కృష్ణ, పద్మాలయ.