telugu navyamedia
సినిమా వార్తలు

“సైరా” అప్డేట్ : 20 గంటల్లోనే డబ్బింగ్ పూర్తి చేసిన చిరు

Syeraa

మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో తొలి తెలుగు స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత గాథ ఆధారంగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కుతున్న చిత్రం “సైరా న‌ర‌సింహారెడ్డి”. కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై రామ్ చ‌ర‌ణ్ నిర్మిస్తున్నాడు. న‌య‌న‌తార క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రంలో అమితాబ్ బ‌చ్చ‌న్, విజ‌య్ సేతుప‌తి, సుదీప్‌, జ‌గ‌ప‌తి బాబు వంటి టాప్ స్టార్స్ న‌టిస్తున్నారు. అక్టోబ‌ర్ 2న గాంధీ జ‌యంతి సంద‌ర్భంగా చిత్రం విడుద‌ల కానుంది. తాజాగా ఈ సినిమా షూటింగ్ పూర్త‌య్యింది. ప్రస్తుతం డబ్బింగ్ పనులు మొదలుపెట్టారు. అయితే ఇప్పుడు చిరు కేవలం ఇరవై గంటల్లో డబ్బింగ్ పూర్తి చేయడం హాట్ టాపిక్ గా మారింది. నిజానికి డబ్బింగ్ చెప్పుకోవడమనేది అంతా ఈజీ కాదు. ప్రతీ సీన్, ఎమోషన్ అర్ధం చేసుకొని డైలాగ్స్ చెప్పాలి. ఒక్కోసారి వారం, పది రోజులు కూడా డబ్బింగ్ థియేటర్ లోనే గడపాల్సి వస్తుంది. అయితే చిరంజీవి మాత్రం “సైరా” డబ్బింగ్ ని తనకున్న అనుభవంతో అతి తక్కువ సమయంలో డబ్బింగ్ పూర్తి చేసేసారు. నిజానికి ఈ సినిమాలో డైలాగ్ పార్ట్ చాలా ఎక్కువ. కొన్ని సన్నివేశాల్లో పేజీల కొద్దీ డైలాగులు పలకాల్సివచ్చిందట. అయినా చిరు ఇరవై రోజుల్లోనే డబ్బింగ్ పూర్తి చేయడం విశేషం. చిరంజీవి తన కొత్త సినిమాను వచ్చే వారమే మొదలుపెట్టాలి. అందుకే “సైరా” డబ్బింగ్ ను ఇంత తొందరగా పూర్తి చేశారని తెలుస్తోంది.

Related posts