telugu navyamedia
సినిమా వార్తలు

“హౌస్ ఫుల్-4” యువరాణిగా పూజాహెగ్డే…!

HF-4

పూజా హెగ్డే “ఒక లైలా కోసం” చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది. స్టార్ హీరోల స‌ర‌స‌న వ‌రుస ఆఫ‌ర్స్ అందుకుంటూ స్టార్ ఇమేజ్ అందుకుంది. పూజా హెగ్డే ఇటీవల “మ‌హ‌ర్షి” చిత్రంతో అభిమానుల‌ని అల‌రించ‌గా, ఆమె తాజా సినిమా “గద్దలకొండ గణేష్” చిత్రం ఇటీవలే విడుదలై హిట్ టాక్ తెచ్చుకుంది. ప్రస్తుతం పూజా “అల‌.. వైకుంఠ‌పుర‌ములో”, “హౌజ్‌ఫుల్-4”, ప్ర‌భాస్‌ రాధాకృష్ణ చిత్రాల‌తో బిజీగా ఉంది. ఈ బ్యూటీ అక్షయ్ కుమార్ హీరోగా తెరకెక్కుతున్న ‘హౌస్‌ఫుల్-4’ అనే చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన కొన్ని ఫస్ట్‌లుక్‌ పోస్టర్లను బుధవారం సోషల్‌మీడియా ద్వారా విడుదల చేశారు. ఇందులో పూజా పాత్రకు సంబంధించి రెండు పోస్టర్లను విడుదల చేశారు. ఒక పాత్రలో యువరాణి మాలాగా, మరో పోస్టర్‌లో పూజాగా ఈ బ్యూటీ కనిపిస్తోంది. “ఈ కథ 1419లో మొదలవుతుంది. 600 సంవత్సరాల తర్వాత 2019లో ముగుస్తుంది. రాజకుమారి మాలా, మరియు పూజాల రోలర్ కోస్టర్ ప్రయాణాన్ని త్వరలో మీరు చూడండి. ట్రైలర్ సెప్టెంబర్ 27న’’ అంటూ పూజా తన సోషల్‌మీడియా ఖాతాలలో పేర్కొంది. అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో రితేష్ దేశ్‌ముఖ్, బాబీ డియోల్ హీరోలుగా నటిస్తున్నారు. పూజాతో పాటు కృతి సనన్, కృతి కర్బందా హీరోయిన్లుగా నటిస్తున్నారు. వీరందరికీ సంబంధించిన ఫస్ట్‌లుక్ పోస్టర్లు కూడా అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.

Related posts