తమిళ బిగ్ బాస్ సీజన్ 2 కంటెస్టెంట్, హాట్ హీరోయిన్ ఆషికా ఆనంద్ వివాదంలో చిక్కుకున్నారు. పాదం, కవలై వెండమ్, మణియార్ కుదుబం, జోంబీ సినిమాలతో హీరోయిన్ క్రేజ్ సంపాదించుకున్న తమిళ నటి ఆషికా ఆనంద్ చెన్నైలో నివాసం ఉంటున్నారు. అక్టోబర్ 5వ తేదీ శనివారం అర్ధరాత్రి ఆషికా ఆనంద్ తన స్నేహితులతో కలిసి ప్రయాణిస్తున్న కారు నుంగబాక్కమ్ ప్రాంతంలో యాక్సిడెంట్‌కు గురైంది. మితిమీరిన వేగం కారణంగా డ్రైవర్ అదుపుచేయలేక పక్కనే ఉన్న భరత్ అనే స్విగ్గీ డెలివరీ బాయ్‌ను ఢీ కొట్టి పక్కనే ఉన్న దుకాణంలోకి దూసుకుపోయింది. దీంతో డెలివరీ బాయ్‌కి తీవ్ర గాయాలైనట్టు తెలుస్తోంది. ప్రమాదం జరిగినప్పుడు కారు డ్రైవర్‌తో పాటు హీరోయిన్ యషికా, ఆమె స్నేహితులు ఫుల్లుగా మద్యం సేవించి ఉన్నట్టు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై తాజాగా యషికా తమిళ మీడియా వర్గాల ద్వాారా స్పందించారు. ప్రమాదానికి గురైంది తన కారు కాదని తన ఫ్రెండ్ కారని తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో తాను వేరే కారులో ఉన్నానని పేర్కొన్నారు. యాక్సిడెంట్ అయ్యాక పారిపోయానని వచ్చిన వార్తల్లో నిజం లేదని, ఏం జరిగిందో చూసేందుకు కారు దిగానని పేర్కొన్నారు. తన వద్ద హోండా సిటీ కారు తప్ప మరో వాహనం లేదని ఇన్‌స్టాగ్రామ్‌లో తన కారు ఫొటోను పోస్ట్ చేశారు. ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్‌ను కారులో ఉన్న తన ఫ్రెండ్‌ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని వెల్లడించారు. తాగి కారు నడిపానంటూ తనపై తప్పుడు వార్తలు రాసిన మీడియా వర్గాలపై పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు. తాను ఓ సెలబ్రిటీని కావడంతో పాపులారిటీ కోసం తన పేరును వాడుకుంటున్నారని మండిపడ్డారు.
previous post