telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

యంగ్ హీరో నిఖిల్ కొత్త సినిమా ప్రారంభం…

nikhil

యంగ్ హీరో నిఖిల్ ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ‘హ్యాపీడేస్’ సినిమాతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన నిఖిల్.. ‘స్వామి రారా’, ‘కార్తికేయ’, ‘ఎక్కడికి పోతావు చిన్నవాడ’.. రీసెంట్‌గా ‘అర్జున్ సురవరం’ లాంటి హిట్ చిత్రాల్లో నటించారు. త్వరలో అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ నిర్మించబోయే సినిమాలో నటించనున్నారు. కాగా ఈ సినిమాకు ‘18 పేజెస్’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ పెట్టారు. ఈ విషయాన్ని గీతా ఆర్ట్స్ సంస్థ ట్విటర్ ద్వారా వెల్లడించింది. సినిమాకు ప్రముఖ దర్శకుడు సుకుమార్ కథ అందిస్తున్నారు. సూర్య ప్రతాప్ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. ఈరోజు నుంచి షూటింగ్ ప్రారంభం కానున్నట్లు నిఖిల్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. అంతేకాదు షూటింగ్‌కు చీఫ్ గెస్ట్‌గా అల్లు వారసురాలు అల్లు అర్హ వచ్చిందట. అర్హను వీడియో తీసి నిఖిల్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసారు. హీరోయిన్ ఎవరన్నది తెలియాల్సి ఉంది.

Related posts