telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

అది వట్టి పుకారే… నాకు కరోనా వైరస్ లేదు : జాకీ చాన్

jackie-chan

సామాన్యుడి నుంచి మొదలుకొని ప్రముఖ వ్యక్తులు సైతం కరోనా వైరస్‌కు తెగ భయపడిపోతున్నారు. చైనాలో పుట్టిన ఈ వైరస్ ప్రపంచ వ్యాప్తంగా పాకింది. వేలాది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. సినీ పరిశ్రమపై కూడా ఈ వైరస్ ఎఫెక్ట్ పడింది. దీనిపై మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. కానీ వేరే వారికి వైరస్ లేకున్నా..ఉందంటూ..ప్రచారం జరుగుతుండడం కలకలం రేపుతోంది. తాజాగా యాక్షన్ హీరో జాకీచాన్‌కు కరోనా వైరస్ సోకిందని పుకార్లు షికారు చేస్తున్నాయి. గత మూడు రోజుల నుంచి దీనికి సంబంధించిన వార్త హల్ చల్ చేస్తోంది. హంకాంగ్‌లో మొదలైన ఈ వార్త చక్కర్లు కొట్టింది. సోషల్ మీడియా పుణ్యమా అని కొన్ని గంటల్లోనే వైరల్ అయ్యాయి. ఇంకేముంది..అభిమాన స్టార్ త్వరగా కోలుకోవాలంటూ పెద్ద ఎత్తున పరామర్శలు వెల్లువెత్తాయి. గెట్ వెల్ సూన్ అంటూ..సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెట్టారు. చివరకు ఈ విషయం జాకీ చాన్ దృష్టిలో పడింది. తాను బాగానే ఉన్నానని, తనకు కరోనా వైరస్ సోకినట్లుగా వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవం అంటూ ప్రకటించాల్సి వచ్చింది. చైనా నుంచి ఇతర దేశాలకు వ్యాపించిన కరోనా ఇప్పుడు ఇండియాకూ వచ్చేసింది. తెలంగాణకు చెందిన ఓ వ్యక్తికి కరోనా సోకినట్లు గుర్తించారు.

Related posts