తెలుగు రాష్ట్రాలలో బంగాళఖాతంలో ఉపరితల ద్రోణి ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మరో రెండు రోజులు పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఇప్పటికే గత మూడు రోజులుగా ఏపీలో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి.నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు జిల్లాలో వానలు పడుతున్నాయి. దీంతో అకాల వర్షాల పట్ల రైతాంగం ఆందోళన వ్యక్తం చేస్తోంది. చేతికొచ్చే సమయానికి వేసిన పంట నీటమునుగుతోందని నెల్లూరు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిత్తూరులో టమాటా, వరి, వేరుశనగ పంటలకు నష్టం వాటిల్లింది. ప్రధానంగా ప్రకాశం, నెల్లూరు జిల్లా రైతులు ఖరీఫ్ సాగుపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణలో కూడా వాతావరణం చల్లగా మారింది. సోమవారం రాత్రి భాగ్యనగరంలో పలుచోట్ల వాన పడింది. దీంతో నగరవాసులు చలికి గజ గజ వణుకుతున్నారు. దీనికితోడు చల్లనిగాలులు కూాడా వీస్తుండంతో జనం బయటకు రావడం లేదు. మరో రెండు రోజుల పాటు ఇలాంటి వాతావరణమే ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటివరకు భారీ వర్షాలకు 15మంది మృతిచెందారు. మరో రెండు రోజుల పాటుత తమిళనాడులోకూడా భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.