telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ

ఎన్నికల పుణ్యం : ఏటీఎం లలో .. వంద నోట్లు, ..కనిపించని పెద్ద నోట్లు ..

huge money caught by police in ap

దేశంలో ఎన్నికల నగారా మోగిందో లేదో పెద్ద నోట్లు కనిపించకుండా పోతున్నాయి. ఇప్పటి వరకు ఏటీఎం కి వెళ్లి నగదు తీస్తే మొదటిగా దర్శనం అయ్యేది పెద్దనోట్లే, అంటే 2000, 500 నోట్లు. కానీ ఇప్పుడు కేవలం 100 నోట్లు మాత్రమే ఏటీఎం లలో దర్శనమిస్తుండటం విశేషం. ఇక తెలుగు రాష్ట్రాలలో పరిస్థితి కూడా అంతే ఉంది. ఈ రాష్ట్రాలలో కూడా అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు రోజులు దగ్గరకు వచ్చే కొద్దీ, 2 వేల రూపాయల నోట్లు మాయం అవుతున్నాయి.

ఇప్పటికే ఏటీఎంలలో డబ్బు విత్ డ్రా చేసుకునేందుకు వెళితే రూ. 500, రూ. 200, రూ. 100 నోట్లు తప్ప, రూ. 2 వేల నోటు బయటకు రావట్లేదు. రాజకీయ పార్టీల నేతలు, ఎన్నికల్లో పోటీ చేస్తున్న వారు 2 వేల నోట్లను దాచారని, అందువల్లే పెద్ద నోటుకు కొరత ఏర్పడిందని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. హైదరాబాద్ లోని ఏటీఎంలలో పెద్ద నోట్లు ఏ మాత్రమూ కనిపించడం లేదు. ఇక పోలీసులకు పట్టుబడుతున్న డబ్బులో అత్యధికం ఈ పెద్ద నోట్లే ఉంటున్నాయి.

Atmదేశంలో గత సంవత్సరం మార్చిలో చలామణిలో ఉన్న కరెన్సీలో సగానికి పైగా ఉన్న రూ. 2 వేల నోట్లు, ఈ సంవత్సరం మార్చికి వచ్చే సరికి 37.3 శాతానికి తగ్గింది. ఆర్బీఐ వెల్లడించిన డేటా ప్రకారం మార్చి 2017 నాటికి మొత్తం 3,285 మిలియన్లు, మార్చి 2018 నాటికి 3,363 మిలియన్ల రూ. 2 వేల నోట్లు చెలామణిలో ఉన్నాయి. గడచిన మూడు నెలలుగా డిపాజిట్ల రూపంలో రూ. 2 వేల నోట్లు బ్యాంకులకు రావడం లేదు. ఆర్బీఐ నుంచి కూడా సరఫరా లేకపోవడంతోనే షార్టేజ్ ఏర్పడింది. ఎన్నికలు ముగిసిన తరువాత పరిస్థితి అదుపులోకి వస్తుందని భావిస్తున్నాం.. అని బ్యాంక్ ఎంప్లాయిస్ యూనియన్ కార్యదర్శి వ్యాఖ్యానించారు.

Related posts