telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ప్రేమికుల రోజునే రాధేశ్యామ్ టీజర్ !

రెబల్ స్టార్ ప్రభాస్ వరుస సనిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ ఆదిపురుష్, సలార్ సినిమా షూటింగ్‌లలో పాల్గొననున్నాడు. బాహుబలి తరువాత జాతీయ స్థాయి హీరోగా ప్రభాస్ గొప్ప స్థాయిలో ఉన్నాడు. వెంటనే సాహో అంటూ యాక్షన్ హీరోగా కూడా నిరూపించుకున్నాడు. అయితే ఇటీవల ప్రభాస్ చేసిన తాజా చిత్రం రాధేశ్యామ్. ఇందులో బుట్టబొమ్మ పూజ హెగ్దె హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా టీజర్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. రాధేశ్యామ్ టీజర్ అప్పుడు వస్తుంది, ఇప్పుడు వస్తుందని వార్తలు వచ్చినా టీజర్ విడుదల కాకపోవడంతో అభిమానులు నిరాశ చెందారు. ఈ సినిమా టీజర్‌ సంక్రాంతికి వస్తుందని అనుకున్న అభిమానులు టీజర్ రాకపోవడంతో అసహనం ప్రకటిస్తూ ప్రొడక్షన్ బ్యానర్‌ను ట్రోల్ చేసిన విషయం తెలిసిందే. అయితే రాధేశ్యామ్ టీజర్‌ కోసం తయారు చేసిన వీడియో క్లిప్ ప్రభాస్‌కు అంతగా నచ్చలేదని, దాంతో టీజర్‌లో ప్రభాస్ మార్పులు చెప్పారని అందుకనే టీజర్ ఆలస్యం అయిందని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా కొత్త టీజర్‌ను సిద్దం చేస్తున్నారంట. అన్ని అనుకున్న విధంగా జరిగితే ఫిబ్రవరీ14న టీజర్‌ అభిమానుల ముందుకు వస్తుందని సినీవర్గాల్లో టాక్ నడుస్తోంది. అంతేకాదు ఇవాళ ట్విట్టర్‌లో ప్రేమికుల రోజునే ఈ మూవీ టీజర్‌ రాబోతుందని న్యూస్‌ వైరల్‌ అవుతోంది. దాదాపు ప్రేమకులి రోజునే టీజర్‌ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనిపై క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. 

Related posts