బ్రిటిష్ మహారాణి క్వీన్ ఎలిజిబిత్ భర్త డ్యూక్ ఫిలిప్ మరణించారు. ఇటీవలే 73 వ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకున్నారు. అయితే నవంబర్ 20, 1947లో వీరి వివాహం జరిగింది. ఇటీవల ఆయనకు కింగ్ ఎడ్వర్డ్-7 హాస్పిటల్, సెయింట్ బరతోలోమెవ్ హాస్పిటల్‌లో చికిత్స జరిగింది. ఈ వివరాలను బకింగ్‌హాం ప్యాలెస్ ప్రకటించింది. డ్యూక్ ఆఫ్ ఎడిన్‌బరో ప్రిన్స్ ఫిలిప్ (99) మరణ వార్తను రాజ వంశ కుటుంబ సభ్యులందరికీ తెలియజేసినట్లు బకింగ్‌హాం ప్యాలెస్ ప్రకటన పేర్కొంది. ఆయన పార్దివ దేహానికి అంత్యక్రియలకు త్వరలో ఏర్పాట్లు జరుగుతాయని తెలిపింది. అయితే వివాహం అనంతరం క్వీన్ ఎలిజిబిత్, డ్యూక్ ఫిలిప్ లు హనీమూన్ కోసం హ్యాంప్ షైర్ లోని బ్రాడ్ ల్యాండ్ కు వెళ్లారు. ఆ సమయంలో తీసిన ఫోటోలు కొన్నింటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. బ్లాక్ అండ్ వైట్ కలర్ లో ఉన్న ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
previous post
అమరావతికి మూడు వేల కోట్ల బ్యాంకు గ్యారెంటీ : బొత్స