telugu navyamedia
సినిమా వార్తలు

బిగ్ బాస్-3 : సర్ప్రైజ్ ఇచ్చిన బిగ్ బాస్… కన్నీళ్లు ఆపుకోలేకపోయిన ఇంటి సభ్యులు

Bigg-Boss

బిగ్ బాస్ సీజ‌న్ 3 కార్య‌క్ర‌మం స‌క్సెస్‌ఫుల్‌గా ఎనిమిది వారాలు పూర్తి చేసుకుంది. ఈ సోమవారంతో తొమ్మిదో వారం మొద‌లైంది. ఎనిమిదో వారం ఇంటి నుండి శిల్పా చ‌క్ర‌వ‌ర్తి ఎలిమినేట్ అయ్యింది. ఇప్పుడు ప్ర‌స్తుతం ప‌ది మంది ఇంటి స‌భ్యులు బిగ్ బాస్ ఇంట్లో ఉండ‌గా నామినేషన్‌లో రాహుల్‌ సిప్లిగంజ్‌, హిమజా, మహేశ్‌లు ఉన్నారు. 61 ఎపిసోడ్స్ పూర్తి చేసుకున్న బిగ్ బాస్ షో రేటింగ్‌లోను దూసుకెళుతుంది. తాజా ఎపిసోడ్‌లో ఇంటి కెప్టెన్‌గా ఉండేందుకు ఇద్ద‌రు స‌భ్యులు పోటి ప‌డ్డారు. వారిద్ద‌రు క్రేజీ కాలేజ్ టాస్క్‌లో బెస్ట్ టీచ‌ర్‌, బెస్ట్ స్టూడెంట్‌గా ఎంపికైన వారు. ఇంటి స‌భ్యుల ఏకాభిప్రాయంతో బెస్ట్ టీచ‌ర్‌గా బాబా, బెస్ట్ స్టూడెంట్‌గా మ‌హేష్ ఎన్నుకోబ‌డ్డారు. వీరిద్ద‌రు ఈ వారం ఇంటి కెప్టెన్సీ టాస్క్‌లో పాల్గొంటార‌ని బిగ్ బాస్ తెలిపారు. కెప్టెన్సీ టాస్క్‌లో భాగంగా ప్రచార‌మే ఆయుధం పేరుతో మ‌హేష్‌, బాబాలు మిగ‌తా ఇంటి స‌భ్యుల ద‌గ్గ‌ర‌కి వెళ్లి ప్ర‌చారం చేయ‌వ‌ల‌సి ఉంటుంది. తాము ఎందుకు కెప్టెన్ కావాలో వివ‌రించాల్సి ఉంటుంది. వీరి ప్ర‌చారం న‌చ్చితే మిగతా ఇంటి స‌భ్యుల చేతిలో ఉన్న దండ‌ల‌ని వారి మెడ‌లో వేస్తారు అని బిగ్ బాస్ ఆదేశించారు. ఈ టాస్క్‌లో భాగంగా పునర్నవి, హిమజలు.. బాబా భాస్కర్ మెడలో దండ వేయగా.. మహేష్ విట్టా మెడలో వరుణ్ సందేశ్, హిమజ, శివజ్యోతి, రాహుల్, రవి, శ్రీముఖిలు దండలు వేశారు.

ఎక్కువ ఓట్లు మహేష్ విట్టాకే రావడంతో బాబా భాస్కర్‌పై విజయకేతనం ఎగురవేసి బిగ్ బాస్ హౌస్‌కి కెప్టెన్ అయ్యాడు శిష్యుడు మహేష్ . ఇక ఇంటి స‌భ్యుల‌కి ప‌లు డ్యూటీలు అప్ప‌గించిన మ‌హేష్ ఆ త‌ర్వాత ల‌గ్జ‌రీ బడ్జెట్ టాస్క్ ఆడాడు. ఈ టాస్క్‌లో మ‌హేష్ త‌న ద‌గ్గర ఉన్న బోర్డ్‌ని మిగ‌తా ఇంటి స‌భ్యుల‌కి చూపించాల్సి ఉంటుంది. దానిపై ఉన్న పేరుని డైరెక్ట్‌గా కాకుండా ఇన్‌డైరెక్ట్‌గా మ‌హేష్ కి వివ‌రించాల్సి ఉంటుంది. మ‌హేష్ అది క‌రెక్ట్‌గా గెస్ చేస్తే బిగ్ బాస్ ఇంటి స‌భ్యుల‌కి ఆ ల‌గ్జ‌రీ బ‌డ్జెట్ లభిస్తుంది. మ‌హేష్ అన్నీ క‌రెక్ట్‌గా గెస్ చేయ‌డంతో ఈ వారం ఇంటి స‌భ్యుల‌కి ఫుల్ ల‌గ్జ‌రీ బ‌డ్జెట్ వ‌చ్చింది. ఇక ఇంటి స‌భ్యుల‌కి ఓ స‌ర్‌ప్రైజ్ ఇచ్చారు బిగ్ బాస్‌. హౌజ్‌మేట్స్‌కి సంబంధించిన కుటుంబ‌ స‌భ్యుల‌ని క‌న్ఫెష‌న్ రూంలో ఉంచి వారిని బుల్లి స్క్రీన్‌పై చూపించారు. వారిని స్క్రీన్‌పై చూసిన హౌజ్‌మేట్స్ క‌న్నీరు మున్నీరుగా విలపించారు. ఇక్క‌డ హౌజ్‌మేట్స్‌కి ఓ ట్విస్ట్ ఇచ్చారు బిగ్ బాస్. ఎవ‌రు సోఫాలో లేవొద్దు, మాట్లాడొద్దు అన‌డంతో ఆనందం, బాధ‌ని అన్నింటిని లోప‌లే ఉంచేసుకున్నారు. అయితే ఇంట్లోకి వెళ్ళేందుకు గాను కుటుంబ స‌భ్యుల‌లు ఓ గేమ్ ఆడాల‌ని చెప్పారు. ఇది అదృష్టంతో కూడుకున్న‌ది అని కూడా స్ప‌ష్టం చేశారు. ఇందులో భాగంగా క‌న్ఫెష‌న్ రూంలో ఉంచిన బాక్స్‌లు ఒక్కొక్క‌రు తీసుకొని బిగ్ బాస్ చెప్పిన‌ప్పుడు వాటిని ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఎవ‌రికైతే బిగ్ బాస్ క‌న్ను బొమ్మ వ‌స్తుందో వారు త‌ర్వాతి లెవ‌ల్‌కి వెళ‌తార‌ని బిగ్ బాస్ తెలిపారు. ముందుగా వితికా రిలేటివ్ బాక్స్ ఓపెన్ చేయ‌డంతో బిగ్ బాస్ క‌న్ను బొమ్మ వ‌చ్చింది. దీంతో వితికా పున‌ర్న‌విని హ‌గ్ చేసుకొని చాలా సంతోషించింది. మిగ‌తా వారిలో ఎవ‌రెవ‌ర‌కి కన్ను బొమ్మ వస్తుంది, టాస్క్‌లో ఎవ‌రు విజ‌యం సాధించి లోప‌లికి వెళ‌తారో త‌దిత‌ర వివ‌రాలు నేటి ఎపిసోడ్‌లో ప్ర‌సారం కానున్నాయి.

Related posts