telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

హాట్ హీరోయిన్ తో బైక్ రైడింగ్ కి వెళ్లిన విజయ్ దేవరకొండ…!

vijay devarakonda

‘ఫైటర్’ సినిమాకు సంబంధించిన కొన్ని స్టిల్స్ లీకయ్యాయి. విజయ్ దేవరకొండ బైక్‌పై కూర్చుని ఉండగా, అనన్య ఆయన ముందు కూర్చుని ఉన్నారు. రాత్రివేళల్లో ఈ సీన్‌ను చిత్రీకరిస్తుండగా ఎవరో ఫొటోలు తీసారు. దాంతో ఈ ఫొటోలు కాస్తా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరో తెలుసా? బాలీవుడ్‌లో మొన్న మొన్ననే అడుగుపెట్టిన లేద అందం అనన్యా పాండే. ‘సాహో’ సినిమాలో విలన్‌గా నటించిన ప్రముఖ బాలీవుడ్ నటుడు చుంకీ పాండే కూతురు. ‘ఫైటర్’ సినిమాలో విజయ్ దేవరకొండకు జోడీగా నటిస్తోంది. డ్యాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను తెలుగు, హిందీలో రిలీజ్ చేయనున్నారు.. బాక్సింగ్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో లెజెండరీ బాక్సర్‌ మైక్‌ టైసన్‌తో కీలక పాత్రలో చేయించే ఆలోచనలో ఉన్నాడట. అయితే మైక్‌ పూరి సినిమాలో అతిథి పాత్రలో నటించేందుకు అంగీకరిస్తాడా లేదా అన్న విషయం చూడాలి. ఈ సినిమాకు ముందుగా పూరి ఫైటర్‌ అనే టైటిల్‌ను అనుకున్నా.. ఆ టైటిల్‌ విషయంలో కరణ్ అభ్యంతరం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. ఫైటర్‌ చాలా నార్మల్‌గా ఉందని అన్ని భాషలకు సూట్ అయ్యే మరో డిఫరెంట్ టైటిల్‌ అయితే బెటర్‌ అన్న అభిప్రాయం వ్యక్తంచేశాడట. 

Related posts