telugu navyamedia
సినిమా వార్తలు

సినిమా టిక్కెట్ల వివాదంపై స్పందించిన వ‌ర్మ‌..

తెలుగు సినిమా పరిశ్రమకు, ఏపీ ప్రభుత్వానికి మ‌ధ్య టికెట్ రేట్ల వివాదం కొన‌సాగుతునే ఉంది. టికెట్ ధర విషయంలో ప్రభుత్వం పట్టుబట్టి ఉండగా… సినీ పరిశ్రమలోని పెద్దలు పెద్ద సినిమాల విషయంలో వెసులుబాటు ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.

ఈ క్ర‌మంలో థియేట‌ర్‌లో ప్రత్యేక ప్రదర్శనలు తదితర విష‌యాల‌పై వివాద‌స్ప‌ద ద‌ర్శ‌కుడు రాంగోపాల్ వర్మ ఘాటుగా స్పందించారు. టిక్కెట్ రెట్ల‌పై ఏపీ ప్రభుత్వంపై సెటైర్లు వేశారు.

ఓ వస్తువును ఎవరైనా ఉత్పత్తిదారుడు తయారు చేసిన తర్వాత వినియోగదారుడికి అమ్మేందుకు ఒక ధర నిర్ణయిస్తాడు. తనకు అయిన వ్యయం, తన శ్రమకు ఫలితాన్ని జోడించి ధరను నిర్ణయించుకొంటాడు. వినియోగదారుడు నచ్చితే కొంటాడు. లేకపోతే ఉత్పత్తిదారుడు నష్టపోతాడు. ఒకవేళ వినియోగదారుడు కొనుగోలు చేస్తే.. దానిపై ప్రభుత్వం ట్యాక్స్ వసూలు చేసుకోవాలి. అంతే తప్పా ధరను నిర్ణయించే అధికారం ప్రభుత్వానికి లేదు అని రాంగోపాల్ వర్మ అన్నారు.

ఓ ప్ర‌ముఖ ఛాన‌ల్‌లో జ‌రిగే ఓ కార్యక్ర‌మంలో పాల్గొన్న వ‌ర్మ‌.. ఏపీ మినిస్ట‌ర్ పేర్నినానితో మాట్లాడారు. రేకుల షెడ్డు థియేటర్, మల్టి ప్లెక్స్ .. సినిమా టికెట్ ధరఒకటే అనడం సరికాదని అన్నారు. కాకా హోటల్ ఇడ్లీ, ఫైవ్ స్టార్ హోటల్ ఫుడ్ ధరలతో పోలుస్తూ. మరి వీటి ధరలను కూడా సామాన్యుడికి అందుబాటులోకి తీసుకొస్తారా అంటూ ఏపీ ప్రభుత్వానికి ప్ర‌శ్నించారు.

ఉదాహరణకు ఇడ్లీ తయారు చేయాలంటే.. దానికి కావల్సిన ముడిసరుకు ఒకటే ఉంటుంది. కాక హోటలైనా, స్టార్ హోటలైనా ఆ పదార్థాలతోనే ఇడ్లీలు చేస్తారు. అప్పుడు కాకా హోటల్ ఉండే రేటునే ఫైవ్ స్టార్ హోటల్ పెట్టాలంటే అది కరెక్ట్ లాజిక్ కాదుని ప్ర‌శ్నించారు..

ఆంధ్రప్రదేశ్ మంత్రులు పేర్ని నాని, అనిల్ కుమార్ యాదవ్ చేసిన వ్యాఖ్యలను ఆర్జీవి తప్పుపట్టారు. హీరోల రెమ్యునరేషన్ల కారణంగా నిర్మాణ వ్యయం పెరిగిపోతుందనే వ్యాఖ్యలను ఆయన ఖండించారు..అత్యధిక రెమ్యునరేషన్ హీరోలకు ఇవ్వడానికి కారణం వారికి ఉన్న బ్రాండ్ కారణమని అని ఆర్జీవి తెలిపారు.

సినీ నిర్మాత ఎవరైనా సినిమాను తీసి.. తన మూవీకి టికెట్ ధర నిర్ణయించుకొంటే తప్పేమి లేదు. ప్రేక్షకుడికి నచ్చితే సినిమాకు వస్తారు లేదంటే నిర్మాత నష్టాల్లో మునిగిపోతాడు. టికెట్ల రేట్లు తగ్గించడం వెనుక ఓ ఇద్దరు ప్రముఖ హీరోలను తొక్కేయడం అనే ఆరోపణల గురించి నాకు తెలియదు. టికెట్ రేట్లు తగ్గిస్తే.. హీరో సినిమాలకు ఏమీ కాదు. ఓ పది కోట్లు నష్టపోతారేమో.. కానీ సినిమా ఆడ‌క‌పోతే న‌ష్ట‌పోయేది నిర్మాత అని అన్నారు. 

సినిమా పరిశ్రమకు నష్టం కలిగిస్తున్న కోవిడ్‌ను ఏమి చేయలేం.. అలాగే ఏపీ ప్రభుత్వాన్ని కూడా ఏమీ చేయలేం. ఈ రెండింటిని భరించాల్సిందే అని వర్మ అన్నారు. సినిమా ప‌రిశ్ర‌మ‌లో ఏది అడుగుతున్నారో దానికి ప్ర‌భుత్వం జ‌వాబు ఇస్తే చెబితే చాలు..

Related posts