telugu navyamedia
సినిమా వార్తలు

టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడీ దూకుడు..

టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడీ అధికారులు దూకుడు పెంచారు. మత్తుమందు సరఫరాదారులు కెల్విన్, వాహిద్‌తో పాటు మరో వ్యక్తిని ఎన్​ఫోర్స్​మెంట్ డైరెక్టరేట్ అధికారులు ప్రశ్నించారు. ఇప్పటికే పలువురు ప్రముఖులకు నోటిసులు పంపిన ఈడీ.. పూరీ జగన్నాథ్, ఛార్మి, రకుల్, కెల్విన్‏లను విచారిచిందింది. డ్రగ్స్ వాడారన్న ఆరోపణలతో పాటు.. భారీగా ఆర్ధిక లావాదేవీలు జరిగాయనే అరోపణల మధ్య ఈడీ విచారణ కొనసాగుతోంది.

Rana Daggubati appears before Enforcement Directorate in 4-year-old drug  case - Movies News

ఇప్పటికే పలువురు ప్రముఖులను ప్రశ్నించిన ఈడీ.. నేడు ప్రముఖ నటుడు దగ్గుబాటి టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసులో హీరో రానా దగ్గుబాటి ఈడీ విచారణ కొనసాగుతుంది. సుమారు రెండు గంటలకు పైగా ఈడీ అధికారులు రానాను విచారిస్తున్నారు. మనీలాండరింగ్‌, ఫెమా యాక్ట్ నిబంధనల ఉల్లంఘనకు సంబంధించి రానాను ప్రశ్నిస్తున్నారు. విదేశీ టూర్లు,మనీ ట్రాన్సాక్షన్స్‌పై ఈడీ అధికారులు కూపీ లాగుతున్నారు. బ్యాంకు ఖాతాలతో పాటు కొన్ని ముఖ్యమైన డాక్యుమెంట్లను రానా తన వెంట తీసుకొచ్చారు. ఆడిటర్స్‌, అడ్వకేట్స్‌తో కలిసి ఆయన ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు.

Tollywood Drug Case: Rana Daggubati enquired before ED Officials

PMLA కేసులో మొదటిసారి రానా పేరు తెరపైకి వచ్చింది. దీంతో మెదటిసారి సినీతారల డ్రగ్స్ కేసులో రానా విచారణను ఎదుర్కొంటున్నారు. గతంలో 2017 జరిపిన ఎక్సైజ్‌ విచారణలో రానా,రకుల్‌ల పేర్లు తెరపైకి రాలేదు. అయితే డ్రగ్స్‌ పెడ్లర్‌ కెల్విన్‌ ఇచ్చిన సమాచారంతో వారిద్దరికి ఈడీ సమన్లు పంపడం చర్చనీయాంశమైంది. హీరో నవదీప్‌కు చెందిన ఎఫ్ క్లబ్ వ్యవహారాల్లో నవదీప్,రకల్‌తో ఉన్న సంబంధాలపై కూడా ఈడీ ఆరా తీయనుంది.

 

Related posts