telugu navyamedia
సినిమా వార్తలు

“గుణ 369″గా “ఆర్ఎక్స్100” హీరో

Guna-369

తన మొదటి సినిమా “ఆర్ఎక్స్100” తోనే యువ హృదయాలకు దగ్గరయ్యాడు హీరో కార్తికేయ. ఈ చిత్రంలో కార్తికేయ, పాయల్ రాజ్‌పుత్ చూపిన అభినయం అందరినీ ఆకట్టుకోవడమే గాక.. వారిద్దరికీ వరుస అవకాశాలు తెచ్చిపెడుతోంది. ఈ మేరకు హీరో కార్తికేయ ఇప్పటికే తన రెండో సినిమా “హిప్పీ” షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఇదిలా ఉండగానే తాజాగా ఆయనను మరో అవకాశం తలుపుతట్టింది.

కార్తికేయ మూడో సినిమా కూడా కన్ఫర్మ్ అయింది. ఈ సినిమాకు “గుణ 369” అనే ఆసక్తికర టైటిల్ ఫిక్స్ చేశారు. తాజాగా ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్ విడుదల చేశారు. నిజ జీవితంలో జరిగిన కొన్ని సంఘటన ఆధారంగా గ్రామీణ ప్రేమ కథగా ఈ చిత్రం తెరకెక్కనుంది. స్పిన్ట్ ఫిలిమ్స్, జ్ఞాపిక ఎంటర్ టైన్‌మెంట్స్ బ్యానర్స్‌పై అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో రూపొందనున్న ఈ సినిమాకు తిరుమల్ రెడ్డి, అనిల్ కడియాల నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

Related posts