telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

అవకాశాల కోసం .. అందాలు ఆరబోస్తున్న .. రుహానీ శర్మ ..

ruhani sharma latest bold photo shoot

హీరోయిన్స్ అందాలను ఆరబోయటంలో ఎక్కడ తగ్గడం లేదు. స్కిన్ షో చూపిస్తూ కుర్రకారుకు రెచ్చగొడుతున్నారు. తాజాగా చి.ల.సౌ ఫేం.. యంగ్ బ్యూటీ రుహానీ శర్మ సోషల్ మీడియాలో టచ్ లోకొచ్చింది. ఈ భామ తాజా పోస్టింగ్ జోరుగా వైరల్ అవుతోంది. రుహాని నటించిన తొలి సినిమా `చి.ల.సౌ` బాక్సాఫీస్ వద్ద ఆశించినంత పెద్ద సక్సెస్ సాధించకపోయినా విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. సుశాంత్ – రుహానీ జంట నటనకు పేరొచ్చింది. ఆ సినిమాలో సింపుల్ మిడిల్ క్లాస్ గాళ్ పాత్రలో రుహానీ చక్కని అభినయం కనబరిచింది. అయినా ఎందుకనో ఈ అమ్మడు రెండో అవకాశం అందుకోవడంలో మాత్రం తడబడుతోంది.

చి.ల.సౌ రిలీజై ఇంతకాలమైనా ఇంకా తెలుగులో వేరొక సినిమాకి సంతకం చేయలేదు. కనీసం ఇతర పరిశ్రమల్లో అయినా ఏ అవకాశం అందుకుందో తెలీదు.చి.ల.సౌ దర్శకుడు రాహుల్ రవీంద్రన్ రెండో సినిమాతో బిజీ బిజీ. రాహుల్ ప్రస్తుతం నాగార్జున హీరోగా `మన్మధుడు2` తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. కనీసం ఈ చిత్రంలో అతిధి పాత్రకు అయినా రుహానీ పేరును పరిశీలించలేదా? అన్నది చూడాలి. అయితే రుహానీలో గ్రేసు- స్పీడు చూసైనా మునుముందు అక్కినేని కాంపౌండ్ పిలిచి అవకాశాలిస్తుందేమో! అందానికి అందం .. వేడెక్కించే వయ్యారం ఈ భామలో కొదవేమీ లేదని తాజా పోస్ట్ చెప్పకనే చెబుతోంది. మిల్కీ ప్లస్ మిల్కీ స్క్వేర్ అన్నట్టే చెలరేగుతోంది ఈ బ్యూటీ!

Related posts