telugu navyamedia
సినిమా వార్తలు

‘ఆచార్య’ నుంచి ‘సానా కష్టం నీతో మందాకినీ’ లిరికల్‌ సాంగ్‌….

మెగాస్టార్‌ చిరంజీవి కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్నసినిమా ‘ఆచార్య’ . ఈసినిమాలో చిరుతో పాటు ఆయన తనయుడు రామ్​చరణ్ కూడా ప్రధాన పాత్రలో నటించారు. చిరంజీవికి జోడిగా కాజల్, చ‌ర‌ణ్‌కు జోడి పూజా హెగ్డే హీరోయిన్లుగా చేశారు. 

Acharya: మెగా అభిమానులకు న్యూఇయర్ స్పెషల్ గిఫ్ట్.. కీలక అప్డేట్ ఇచ్చిన ఆచార్య చిత్రయూనిట్.. | third song saana kastam song from megastar chiranjeevi acharya movie release on 2022 ...

ఇప్పటికే విడుదలైన ఇప్పటి వరకు విడుదలైన ఫస్ట్‌ లుక్‌, టీజర్స్, సాంగ్స్ సినిమాపై ఒక రేంజ్ లో అంచనాలను రెట్టింపు చేస్తున్నాయి. ముఖ్యంగా ఇప్పటికే ఈ సినిమాలోని లాహె లాహె, నీలాంబరి పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వ‌చ్చింది.

తాజాగా ‘ఆచార్య’ నుంచి ‘సానా కష్టం’ పాట లిరికల్ వీడియో రిలీజ్ అయ్యింది. ‘సానా కష్టం వ‌చ్చిందే మందాకినీ… చూసేవాళ్ల క‌ళ్లు కాకులు ఎత్తుకుపోనీ.. సానా కష్టం వ‌చ్చిందే మందాకినీ.. నీ న‌డుము మ‌డ‌త‌లోన జ‌నం న‌లిగేపోనీ..’ అంటూ ఈ పాట సాగుతుంది.

ఈ స్పెషల్‌ సాంగ్‌లో చిరు మరోసారి తన స్టైల్​, గ్రేస్​తో అదరగొట్టారు. చిరంజీవితో కలిసి రెజీనా వేసిన స్టెప్పులు అందాల క‌నువిందు చేసింది. ఇన్నేళ్లయినా చిరులో ఏమాత్రం గ్రేస్ తగ్గలేదు..  ఇక రేవంత్, గీత మాధురిల హస్కీ వాయిస్ సాంగ్ ని మరో రేంజ్ లో నిలబెట్టింది. 

Acharya Movie Saana Kastam Song: Typical Mass Number With Saving 'Grace'

ఈ సినిమాకు సంగీతం దిగ్గజం మణిశర్మ సంగీతమందించారు. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్​టైన్​మెంట్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి4న విడుదల కానుంది.

Related posts