మెగా హీరో వరుణ్ తేజ్ గద్దల కొండ గణేష్ చిత్రం తర్వాత బాక్సింగ్ నేపథ్యంలో స్పోర్ట్స్ డ్రామా చేస్తున్నాడు. ఇందులో కథానాయికలుగా నభా, నిధిని ఎంపిక చేసినట్టు తెలుస్తుంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుంది. కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రంలో రమ్యకృష్ణ కీలక పాత్ర పోషిస్తున్నట్టు టాక్. అయితే డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన తాజా చిత్రం “ఇస్మార్ట్ శంకర్”. బ్లాక్ బస్టర్ విజయం సాధించిన ఈ చిత్రంలో రామ్ సరసన నభా నటేష్, నిధి అగర్వాల్ కథానాయికలుగా నటించారు. ఇస్మార్ట్ విజయం తర్వాత ఇద్దరు బ్యూటీస్‌పై టాలీవుడ్ నిర్మాతల దృష్టి పడింది. ఆఫర్స్ వారిని వెతుక్కుంటూ వస్తున్నాయి. నిధి అగర్వాల్… గల్లా అశోక్ డెబ్యూ చిత్రంతో పాటు పలు చిత్రాలు చేస్తుంది. నభా నటేష్ తమిళంలో పలు ప్రాజెక్ట్‌లు చేస్తుంది. అయితే తాజా సమాచారం నభా నటేష్, నిధి అగర్వాల్ మరోసారి కలిసి పని చేయబోతున్నారన్నమాట.
previous post