telugu navyamedia
రాశి ఫలాలు

నవంబర్ 21, ఆదివారం రాశిఫలాలు..

మేష రాశి..

కొన్ని వ్యవహారాలలో ధైర్యంగా వ్యవహరించి అందరి ప్రశంసలు అందుకుంటారు. చేపట్టిన పనులను ఆలస్యంగా ప్రారంభిస్తారు. అనవసర భయాందోళనకు గుర‌వుతారు. అల్పభోజనం వలన అనారోగ్యాన్ని పొందుతారు. పనుల్లో తొందరపాటు మంచిది కాదు. ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు.

వృషభ రాశి..

ప్రతీ విషయాన్ని కుటుంబంతో చర్చించి ముందుకు న‌డ‌వాలి. భాగస్వామిక ఒప్పందాలు, రిజిస్ట్రేషన్ వ్యవహారాల్లో పునరాలోచన మంచిది.అనుకోని లాభాలను అందుకుంటారు. అనారోగ్యానికి గురవుతారు. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

మిధున రాశి..

బంధు, మిత్రులతో ఆనందంగా గడుపుతారు. మనోద్వేగానికి గురవుతారు. కొత్తపనులు వాయిదా వేసుకోవడం మంచిది. పిల్లల పట్ల ఎక్కువ పట్టుదలతో ఉండడం మంచిది కాదు. కోపాన్ని తగ్గించుకోవడం అన్నివిధాలా మేలు చేస్తుంది.బంధుమిత్రులతో కలిసి విందు, వినోదాలలో పాల్గొంటారు.

కర్కాటక రాశి..

ఇసుక, క్వారీ కాంట్రాక్టర్లకు అధికారుల నుంచి అభ్యంతరాలెదురవుతాయి. శ్రీవారు, శ్రీమతితో ప్రయాణాలు, సంభాషణలు అనుకూలిస్తాయి. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. ఆకస్మిక ధన నష్టం ఏర్పడే అవకాశం ఉంది. కొత్తపనులను వాయిదా వేస్తారు. ప్రయాణాలు అధికంగా చేస్తారు.

సింహ రాశి..

నిరుద్యోగులకు, ప్రింటింగ్ స్టేషనరీ రంగాల వారు చికాకులను ఎదుర్కొంటారు. చేపట్టిన పనులు విజయవంతంగా పూరి చేస్తారు. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతారు. అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. ఆహార, ఆరోగ్య విష‌యంలో జాగ్ర‌త్త‌లు పాటించండి.

కన్య రాశి..

స్త్రీల వలన లాభం కలుగుతుంది. సంతానాభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. కుటుంబంలో సుఖ సంతోషాలు ఏర్పాడతాయి. గొప్పవారితో పరిచయం ఏర్పడుతుంది. గృహ అవసరాలకు ప్రాధాన్యమిస్తారు. ముఖ్యమైన వ్యవహారాలు, కార్యక్రమాలు మీ చేతుల మీదుగానే సాగుతాయి.

తుల రాశి..

దూర ప్రయాణాలలో వస్తువులపట్ల మెళుకువ అవసరం. బంధువుల వల్ల సమస్యలు, చికాకులు ఎదుర్కోవలసి వస్తుంది. ఆకస్మిక ధన నష్టం ఏర్పడే అవకాశం ఉంది. వృత్తి ఉద్యోగంలో ఇబ్బందులు తలెత్తుతాయి. ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటారు.కొత్తరుణయత్నాలు చేస్తారు.

వృశ్చిక రాశి..

వ్యాపారాలు, ఉద్యోగాలు విజ‌యం సాధిస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. ఇతరుల నుంచి విమర్శలను ఎదుర్కొంటారు. స్థిరమైన నిర్ణయాలను తీసుకోలేరు. ఆకస్మిక ధనవ్యయం అయ్యే అవకాశం ఉంది. బంధు మిత్రులతో జాగ్రత్తగా ఉండడం మంచిది. రుణ ప్రయత్నాలు చేస్తారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు.

ధనస్సు రాశి..

ప్రారంభించిన కార్యక్రమాలు విజయవంతంగా పూర్తవుతాయి. నూతన వస్తువులు కొంటారు. అనారోగ్య బాధలు అధిమించడానికి అధికంగా డబ్బుని ఖర్చు చేస్తారు. దైవ దర్శనం చేసుకుంటారు. తల పెట్టిన పనులు అనుకున్న విధంగా సకాలంలో పూర్తి చేస్తారు.

మకర రాశి

విద్యుత్ రంగాలలో వారికి మాటపడక తప్పదు. ఆకస్మికంగా ధనలాభం కలుగుతుంది. బంధు మిత్రులతో కలుస్తారు. కుటుంబంలో ఆనందోత్సాహాలు ఏర్పడతాయి. శుభకార్య ప్రయత్నాలు నెరవేరతాయి. బాధ్యతలు అధికమవుతాయి.చేపట్టిన పనుల్లో అభివృద్ధి సాధిస్తారు

కుంభ రాశి..

రాజకీయ నాయకులకు ప్రయాణాలలో మెళుకువ అవసరం. సాంఘిక కార్యక్రమాలలో పాల్గొంటారు. స్త్రీలతో తగాదా పెట్టుకుంటారు. చేపట్టిన పనులు నెరవేరతాయి. కొన్ని పనులు వాయిదా చేసుకోవాల్సి వస్తుంది. స్వల్ప అనారోగ్య కారణంతో నిరుత్సాహంగా ఉంటారు. గృహంలో మార్పులు చోటు చేసుకుంటాయి.

మీన రాశి..

బంధువుల రాకపోకలు పెరుగుతాయి. ప్రయాణాలు అధికంగా చేస్తారు. ఋణలాభం పొందుతారు. చేపట్టిన పనులకు ఆటంకాలు ఏర్పడతాయి. ఎలర్జీతో బాధపడేవారు జాగ్రత్తగా ఉండాలి. అనవసర ఖర్చులు జరిగే సూచనలు ఉన్నాయి. నూతన ఉద్యోగప్రాప్తి క‌లుగుతుంది.

 

 

 

Related posts