telugu navyamedia
రాశి ఫలాలు

డిసెంబర్‌ 25, శనివారం రాశిఫలాలు..

మేషరాశి…

విద్యార్థులకు మంచి రోజు. ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. మహిళలకు అనారోగ్య కలుగవచ్చు జాగ్రత్త. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. బంధువుల నుంచి ఒత్తిడులు ఏర్ప‌డ‌తాయి. ఇంటాబయటా బాధ్యతలు పెరుగుతాయి. వృత్తి ఉగ్యోగల్లో పురోగతి సాధిస్తారు.

వృషభరాశి..

ఆకస్మికంగా ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. మహిళలకు అనుకోని వివాదాలు ఎదురవుతాయి. ఇంటా, బయట ఒత్తిడి, చికాకులు వంటివి అధికమవుతాయి. కుటుంబంలో చికాకులు ఎదుర‌వుతాయి. శ్రమ పడ్డా ఫలితం కనిపించదు. వృత్తి, వ్యాపారాలలో ఒత్తిడులు పెరుగుతాయి. ఆలయదర్శనాలు చేస్తారు.

మిథునరాశి..

కుటుంబంలో సంతోషకరమైన విషయాలు తెలుస్తాయి. ఐటీ, మేనేజ్మెంట్ రంగాల వారికి లాభదాయకంగా ఉంటుంది. శుభవార్తలు వింటారు. ప్రముఖుల నుంచి కీలక సమాచారం అందుతాయి. విందువినోదాలల్లో పాల్గొంటారు. స్థిరాస్తుల కొనుగోలు యత్నాలు అనుకూలిస్తాయి.

కర్కాటకరాశి..

మహిళలకు అనారోగ్య సూచన. ఉద్యోగస్తులకు పనిభారం, అధికారుల నుంచి వేధింపులు అధికం అవుతాయి. బంధువులతో గొడ‌వ‌లు అవుతాయి. ధనన‌ష్టం క‌లుగుతుంది. కుటుంబంలో చికాకులు ఎదుర‌వుతాయి. ఆరోగ్యం కుదుటపడుతుంది.

సింహరాశి..

వైవాహిక జీవితంలో ఎదురయ్యే సమస్యలను కూడా ఈ రోజు అధిగమించవచ్చు. కొత్త‌వారితో పరిచయం ఏర్ప‌డుతుంది.. ఆరోగ్యంలో శారీరకంగా కూడా మంచి మార్పులు కనిపిస్తాయి. వ్యవహారాలలో విజయం సాధిస్తారు. నిరుద్యోగుల ఆశలు నెరవేరతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు.

కన్యరాశి..

ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఆధ్యాత్మిక విషయాలను తెలుసుకోవాలనే ఆసక్తి కనిపిస్తుంది. వస్త్ర, ఫ్యాన్సీ, మందులు, పచారీ వ్యాపారాలు ఊపందుకుంటాయి. కుటుంబసభ్యులతో వివాదాలు ఏర్ప‌డ‌తాయి.పార్టీ కోసం డబ్బు ఖర్చు చేయవలసి ఉంటుంది.

తుల‌రాశి..

ఉద్యోగస్తులు, ప్రైవేటు సంస్థల్లో వారికి అధికారులతో అవగాహన కుదరదు. కొత్త పనులు ప్రారంభిస్తారు. చిన్ననాటి స్నేహితుల‌ను క‌లుసుకుంటారు. కుటుంబంలో శుభకార్యాలకు హాజరవుతారు. మీ సోదరులు, సోదరీమణులతో ఉన్న సంబంధాలు మెరుగుపడతాయి. దైవదర్శనాలు చేస్తారు. ఇంటి నిర్మాణాలు చేపడతారు. అనేక మూలాల నుండి డబ్బు ప్రయోజనాలు ఆశించబడతాయి.

వృశ్చికరాశి..

ఆఫీసుకు వెళ్లాల్సిన వారికి ఆహ్లాదకరంగా ఉంటుంది. చిన్ననాటి మిత్రుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. విందువినోదాలు పాల్గొంటారు. కొన్ని వివాదాలు తీరతాయి. ఓర్పు, పట్టుదలతో శ్రమించి అనుకున్నది సాధిస్తారు. ప్రయాణాల్లోను, వాహనం నడుపుతున్నపుడు మెలకువ వహించండి.

ధనుస్సురాశి..

కొత్తగా రుణాలు చేస్తారు. బంధువులు, మిత్రులతో వివాదాలు ఏర్ప‌డ‌తాయి. ధనవ్యయం క‌లుగుతుంది. ఆరోగ్యం బాగా ఉండ‌దు.. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి.ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి చూపవచ్చు.పత్రికా సంస్థలలోని వారికి ఒత్తిడి, పనిభారం అధికం అవుతాయి.

మకరరాశి..

ఆకస్మిక ధనలాభయోగం ఉంటుంది. ఇంటా, బయటా చికాకులు ఎదుర‌వుతాయి. ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. ఆకస్మిక ద్రవ్య లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఆర్థిక ఇబ్బందులు ఎదుర‌వుతాయి. అనుకోని ప్రయాణాలు చేస్తారు. బంధువులతో గొడ‌వ‌లు వ‌చ్చే సూచ‌న‌లు క‌నిపిస్తాయి. ఇంటాబయటా సమస్యలు ఎదుర‌వుతాయి. అనారోగ్యం బారిన ప‌డ‌తారు.

కుంభరాశి..

కుటుంబ జీవితంలో కూడా అనుకూల వాతావరణం ఉంటుంది. ఈ రోజు సామాజిక స్థాయిలో మీ ప్రతిష్ట పెరుగుతుంది. మానసిక ఆరోగ్యంలో మంచి మార్పులు ఈరోజు చూడవచ్చు. ఎంతటి వారినైనా ఆకట్టుకుంటారు. వ్యవహారాలలో విజయం సాధిస్తారు. శుభకార్యాలలో పాల్గొంటారు. వ్యాపార, ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు.

మీనరాశి..

సమస్యల పరికార్యజయం. ఆప్తుల నుంచి శుభవార్తలు. ఆకస్మిక ప్రయాణాలు. ఆలయ దర్శనాలు. వ్యాపార, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి. దైవదర్శనాలు చేస్తారు. విందులు, వినోదాలలో పాల్గొంటారు..

 

 

Related posts