telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సినిమా వార్తలు

మ్యూజికల్ నైట్ లో చిరంజీవి .. సంగీత కళాకారులను పట్టించుకోవాలని విజ్ఞప్తి..

chiranjeevi on cine musical night

హైదరాబాద్ లో సినీ సంగీత కళాకారుల సంఘం తరఫున నిర్వహించిన స్వరసంగమం మ్యూజికల్ నైట్ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆధునిక పరిజ్ఞానం రాకతో లైవ్ రికార్డింగులు తగ్గిపోయాయని, దాంతో సంగీత కళాకారులకు ఉపాధి అవకాశాలు తగ్గిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. చిత్ర పరిశ్రమ మద్రాసులో ఉన్నప్పుడు, ఏవీఎం, ప్రసాద్ స్టూడియోల్లో భారీ ఆర్కెస్ట్రాతో మ్యూజిక్ డైరెక్టర్లు లైవ్ రికార్డింగ్స్ చేపట్టేవారని, పెద్ద సంఖ్యలో సంగీత కళాకారులకు చేతినిండా పని ఉండేదని చిరంజీవి గుర్తుచేసుకున్నారు.

అప్పటి లైవ్ రికార్డింగులు చూడడం ఓ పండగలా ఉండేదని తెలిపారు. ఇప్పుడు టెక్నాలజీ రాకతో లైవ్ రికార్డింగ్ లు తగ్గిపోయి, ఓ చిన్నగదిలో డిజిటల్ ఎక్విప్ మెంట్ సాయంతోనే మ్యూజికల్ ఎఫెక్ట్ లు సృష్టిస్తున్నారని తెలిపారు. ఈ కారణంగా ఎంతోమంది సంగీత వాద్య కళాకారులు ఉపాధి లేక ఇతర రంగాలకు వలసపోతున్నారని చిరంజీవి బాధను వ్యక్తం చేశారు. అలాంటివాళ్లను ఆదుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని, తాను కూడా సాయం చేస్తానంటూ చిరు ముందుకు వచ్చారు.

Related posts