telugu navyamedia
సినిమా వార్తలు

పూరీ జగన్నాథ్ కు హీరో ఖరీదైన గిఫ్ట్… ఛార్మి అప్సెట్

Ram-Pothineni
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని మొదటిసారి పూరి జగన్నాధ్ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం ‘ ఇస్మార్ట్ శంకర్’.. ఈ సినిమా లో నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తుండగా, మరో హీరోయిన్ గా నాభా నటేష్ ను ఎంపిక చేశారు నిర్మాతలు. ప్రస్తుతం హైదరాబాద్ లో శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. అయితే ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్న రామ్ దర్శకుడు పూరీ జగన్నాథ్ కు ఖరీదైన గిఫ్ట్ ఇచ్చారు. ప్రపంచంలో కెల్లా అత్యంత ప్రత్యేకమైన, ఖరీదైన కాఫీ “కోపి లువాక్”ని పూరికి గిఫ్ట్ గా ఇచ్చాడు రామ్. గూగుల్ లో దీని ధర చూస్తే షాక్ అవుతారంటూ ఈ విషయాన్నీ పూరి సోషల్ మీడియాలో అభిమానులతో షేర్ చేసుకున్నారు. కోపి లువాక్ ప్రస్తుతం  10 గ్రాములు రూ.2633. అయితే ఇది చూసిన ఛార్మి “షిట్ షిట్ షిట్” అంటూ అప్సెట్ ఎమోజీని జతచేసి పోస్ట్ చేసింది. 
ఇక రామ్ సరికొత్తగా, స్టైలిష్ గా  కనిపిస్తున్న ఈ చిత్రం లో పునీత్ ఇస్సార్, సత్య దేవ్, మిలింద్ గునాజి, ఆశిష్ విద్యార్థి మరియు గెటప్ శ్రీను ఇతర పాత్రల్లో నటిస్తున్నారు, మణిశర్మ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రానికి రాజ్ తోట సినిమాటోగ్రఫీ ని అందిస్తున్నారు. పూరీ జగన్నాధ్ టూరింగ్ టాకీస్ , పూరీ కనెక్ట్స్ పతాకాలపై పూరీ జగన్నాధ్ , ఛార్మి కౌర్ లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా ని మే లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

Related posts