telugu navyamedia
సినిమా వార్తలు

త్వరలో మన జీవితాల్లో ఎంతో మార్పు రానుంది..భర్తపై కాజల్ ఎమోషనల్ నోట్

అందాల చంద‌మామ‌ కాజల్ అగర్వాల్ త్వరలో ఓ పండంటి బిడ్డకు జన్మనివ్వనుంది. ముంబయికి చెందిన వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లును రెండేండ్ల కిందనే ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే . అయితే గతేడాది చివరల్లో కాజల్ ప్రెగ్నెన్సీ ని తెలుపుతూ ఓ ఫోస్ట్ పెట్టింది. కాజల్ చాలా రోజుల నుంచి తన ప్రెగ్నెన్సీ రోజుల గురించి ఎప్పటికప్పడు తన అభిమానులు తెలియస్తూనే ఉంది.

తాజాగా తన భర్త గౌతమ్‌ కిచ్లుకు స్పెషల్ థ్యాంక్స్ చెబుతూ తన ఎమోషనల్‌ నోట్‌ రాసింది . ప్రస్తుతం కాజల్ చేసిన పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.

తన ప్రెగ్నెన్సీ టైంలో కాబోయే తల్లిగా కాజల్‌ ఎదుర్కొనే అనారోగ్య సమస్యల్లో గౌతమ్‌ భర్తగా ఎంత బాధ్యతగా వ్వవహరించాడో ఈ సందర్భంగా కాజల్‌ వివరించింది.

“డియర్‌ గౌతమ్‌.. ఓ మంచి భర్తగా, నాకెప్పుడూ తోడుగా ఉన్నందుకు, ప్రతి ఆడపిల్ల కోరుకునే తండ్రిగా ఉన్నందుకు ధన్యవాదాలు. అలసటగా అనిపించి, రాత్రివేళల్లో సరైన నిద్రలేనప్పుడు.. నువ్వు కూడా నాతోపాటే నిద్రలేచి ఎంతో జాగ్రత్తగా చూసుకున్నావు. ఈ సమయంలో నాకు అన్నీ సౌకర్యవంతంగా ఉండేలా ఏర్పాట్లు చేశావు. నాకెలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ప్రతిక్షణం నన్ను ఎంతగానో సంరక్షించావు. సంతోషంగా ఉండేలా చేశావు.

త్వరలో మన ముద్దుల బేబీ ఈ లోకంలోకి రానుంది. అంతకుముందే నువ్వు ఎంత గోప్ప తండ్రివో ఈ ప్రపంచానికి తెలియజేయాలనుకుంటున్నాను. గత 8 నెలలుగా నీలో ఓ గొప్ప తండ్రిని చూస్తున్నాను. పుట్టబోయే మన బిడ్డను నువ్వు ఎంతలా ప్రేమిస్తున్నావో, తన సంరక్షణ కోసం ఎంతలా శ్రమిస్తున్నావో నాకు తెలుసు. నువ్వు చూపించే ఈ అమితమైన ప్రేమ మన బిడ్డ అదృష్టంగా భావిస్తున్నా. ఇలాగే ఏ విషయంలోనైనా నువ్వు ఎప్పుడూ తనకి ఒక ప్రేరణగా ఉండాలని కోరుకుంటున్నా అని అన్నారు.

అంతేకాకుండా త్వరలో మన జీవితాల్లో ఎంతో మార్పు రానుంది. ఇప్పటిలా మన కోసం మనం సమయాన్ని కేటాయించుకోలేం. ప్రతి వారాంతంలో సినిమాలు, షికార్లకు వెళ్లలేం. టీవీ షోలు చూసుకుంటూ ఆలస్యంగా నిద్రపోలేం. అతిముఖ్యంగా పార్టీలు, డేట్‌ నైట్స్‌కు దూరమవుతాం..అయినప్పటికీ నాకు చాలా సంతోషంగా ఉంది. వీటన్నింటికి దూరమైనా బిడ్డతో విలువైన సమయాన్ని గడుపుతాం కాబట్టి. మన జీవితంలో ప్రతిక్షణం మరింత ఆనందంగా మారుతుంది. పరిస్థితులు మారొచ్చు కానీ, నాపై నీకున్న ప్రేమ మాత్రం ఎప్పటికీ ఇలాగే ఉంటుంది. ఐ లవ్యూ’ అంటూ భర్త గౌతమ్‌ను ఉద్దేశించి ఎమోషనల్‌ అయ్యింది కాజల్‌.

Related posts