telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

రిషి కపూర్ ను రొమాంటిక్ హీరో అని పిలుచుకొనేవారు…

rishi

రిషి కపూర్(67) హాస్పిటల్ లో ట్రీట్ మెంట్ తీసుకుంటూ 2020, ఏప్రిల్ 30వ తేదీ గురువారం తుది శ్వాస విడిచారు. క్యాన్సర్ తో బాధపడుతున్న రిషి కపూర్ శ్వాసకోస సమస్యతో బాధ పడుతుండటంతో హాస్పిటల్ లో జాయిన్ చేశామని అని ఆయన పెద్ద కొడుకు రణ‌ధీర్ కపూర్ వెల్లడించారు. రిషికపూర్‌ నీతూసింగ్‌ని జనవరి 20, 1980న పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరూ కలిసి జంటగా పదిహేను సినిమాల్లో నటించారు. ‘ఖేల్‌ ఖేల్‌ మే’, ‘కభి కభి’, ‘అమర్‌ అక్బర్‌ ఆంథోని’, ‘దూస్రా ఆద్మీ’ వంటి సినిమాల్లో రిషి కపూర్‌ సరసన హీరోయిన్‌గా నీతూసింగ్‌ నటించింది. యువ హీరో రణ్‌బీర్‌ కపూర్, రిద్ధిమా వీరి సంతానం. రొమాంటిక్‌ హీరోగా రిషి నటించిన ఆఖరి సినిమా ‘ది బిజినెస్‌ ఆఫ్‌ లవ్‌’. సినీ పరిశ్రమకు చేసిన సేవలకు గుర్తింపుగా 2009లో రష్యన్‌ ప్రభుత్వం ఘనంగా సన్మానించింది. స్కీన్ర్, ఫిలింఫేర్‌ సంస్థలు రిషి కపూర్‌కు జీవిత సాఫల్య పురస్కారాలు అందజేశాయి. ఇక మరెన్నో అవార్డులు సంపాదించుకున్నారు రిషీ. భార్య నీతూ సింగ్ తో ‘దో దూని చార్’లో దంపతులుగా నటించడం విశేషం. 2007లో రిషి ‘డోంట్‌ స్టాప్‌ డ్రీమింగ్‌’ అనే ఇంగ్లీష్‌ చిత్రంలో నటించారు. బాలీవుడ్ లో పృథ్వీరాజ్ గొప్ప కళాకారుల ఖాందాన్. ఏకఛత్రాధిపత్యం వహించిన చలన చిత్ర పితామహుడు. ఆయన ఒరవడిని పెద్దకుమారుడు రాజ్ కపూర్ చేతబట్టాడు. ఆర్.కే స్టూడియో నిర్మించి గొప్ప చిత్రాలు నిర్మించాడు. దర్శకుడు, నటుడిగా పేరొందాడు. ఇక రాజ్ కపూర్ సోదరులు షమ్మికపూర్, శశి కపూర్ లు కూడా బాలీవుడ్ ఒక ఊపు ఊపారు.

రాజ్ కపూర్ తనయులు రణధీర్ కపూర్, రిషి కపూర్ లు. వీరు కూడా హీరోలే. ఇందులో చెప్సాల్సింది. రిషీ కపూర్. ఇతనిది అద్వితియ రికార్డు. 130కి పైగా సినిమాల్లో పైగా హీరోగా నటించారు. క్యారక్టర్‌ నటుడుగా రాణించారు. తన ప్రస్థానాన్ని కొనసాగిస్తూనే..నాలుగో తరానికి రణబీర్‌ కపూర్‌ని ఒక మంచి హీరోగా తీర్చిదిద్దారు. ఇతను సెప్టెంబరు 4, 1952న ముంబైలో జన్మించారు. అన్న రణదీర్, తమ్ముడు రాజీవ్ తో కలిసి..ముంబైలోని కూపరేజ్ రోడ్డులో ఉన్న క్యామ్బియన్ పాఠశాలలో చదివారు. మేయో కళాశాలలో పట్టభద్రుడయ్యాడు. 18 సంవత్సరాల వయస్సులో తొలిసారి..‘మేరా నామ్ జోకర్’ చిన్ననాటి రాజ్ కపూర్ గా నటించారు. 1970లో వచ్చిన ఈ సినిమా అంతగా జనాదరణ నోచుకోలేదు. ‘బాబీ’ సినిమా ఇతని జీవితాన్ని మార్చివేసింది. అందరూ అతడిని రొమాంటిక్ హీరోగా పిలుచుకొనే వారు. ఈయన బాబీ సినిమాలో డింపుల్ కపాడియా సరసన నటించారు. బాబీ పాత్ర కొత్తరకంగా ఉండడంతో రాత్రికి రాత్రే స్టార్ అయిపోయాడు. ‘లైలా మజ్ను’, ‘రఫూ చక్కర్‌’, ‘కర్జ్‌’, ‘ప్రేమ్‌ రోగ్‌’, ‘నగినా’, ‘హనీమూన్‌2, ‘చాందిని’, ‘హీనా’, ‘బోల్‌ రాధా బోల్‌’ వంటి సినిమాలు సూపర్‌ హిట్ సాధించాయి. ఆయనకు 2018 లో క్యాన్సర్ వచ్చింది. దీనితో అమెరికాలో చికిత్స కూడా తీసుకున్నారు. ఆ తర్వాత ఆయన దాని నుంచి కోలుకున్నారు. కలిసి భోజనం చేస్తున్న ఫోటో ని ఆయన భార్య సోషల్ మీడియాలో పోస్ట్ కూడా చేసారు. చివరిగా ‘ది బాడి’ సినిమాలో నటించారు. రిషీ కపూర్ మరణంతో బాలీవుడ్ శోక సంద్రంలో మునిగిపోయింది. 

Related posts