రౌడీ హీరో విజయ్ దేవరకొండను స్టార్ హీరోను చేసిన సినిమా ‘అర్జున్ రెడ్డి’. ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో హీరోగా విజయ్ దేవరకొండ, దర్శకుడిగా సందీప్ రెడ్డి వంగా ఇద్దరూ స్టార్ స్టేటస్ ను అందుకున్నారు. ఈ సినిమాను ఇప్పటివరకు రెండు భాషల్లో రీమేక్ చేశారు. రెండు రీమేక్‌లు బ్లాక్ బస్టర్ హిట్స్ సాధించాయి. అర్జున్ రెడ్డి హిందీ వెర్షన్ ‘కబీర్ సింగ్’ సినిమాలను ఎన్ని వివదాలు చుట్టుముట్టాయో అందరికీ తెలిసిందే. కాగా “అర్జున్ రెడ్డి” తమిళ రీమేక్ “ఆదిత్య వర్మ” కూడా బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది. తమిళంలో తొలుత ఈ చిత్రాన్ని బాల దర్శకత్వంలో రీమేక్ చేశారు. “వర్మ” అనే టైటిల్‌తో తెరకెక్కిన ఈ మూవీ ఔట్‌పుట్ అనుకున్నంత బాగా రాకపోవడంతో ఈ సినిమాని మధ్యలోనే ఆపేసి, సందీప్ రెడ్డి వంగ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా వర్క్ చేసిన గిరీశాయ దర్శకత్వంలో రీమేక్ చేశారు. “ఆదిత్యవర్మ” అనే టైటిల్ తో తెరకెక్కిన సెకండ్ వెర్షన్ సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీనితో ఫస్ట్ వెర్షన్ అలా హోల్డ్ లోనే ఉండిపోయింది. కానీ ఇప్పుడు ఈ చిత్రం డైరెక్ట్ స్ట్రీమింగ్ లో విడుదల కానున్నట్టుగా వినిపిస్తుంది. అమెజాన్ ప్రైమ్ వారు ఈ చిత్రం స్ట్రీమింగ్ హక్కులను కొనుగోలు చేసి నవంబర్ నెలలో విడుదల చేసే ప్లానింగ్ లో ఉన్నట్టు తెలుస్తుంది. మరి ఈ వెర్షన్ ఎలా ఉంటుందో చూడాలి.
previous post
next post