telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు సామాజిక

ఇద్దరి ప్రాణాలను కాపాడిన వాటర్ బాటిల్… ఎలాగంటే…!?

Bottle

కర్టిస్ విట్సన్ అనే వ్యక్తి తన గర్ల్‌ఫ్రెండ్ క్రిస్టల్ (33), కొడుకు హంటర్ విట్సన్ (13)తో కలిసి కాలిఫోర్నియాలోని అరోయో సెకో గార్జే క్యాంప్ గ్రౌండ్‌కు వెళ్లాడు. ఎత్తైన పర్వతాలు, వాటర్ ఫాల్స్ దాటుకుంటూ ఒక చోటి నుంచి ఇంకొక చోటికి వెళ్లడమే ఈ క్యాంప్ గ్రౌండ్ స్పెషాలిటీ. అయితే వీరందరూ ఓ కొండ పైకి వెళ్లేందుకు సహాయంగా ఉండే తాడు కనిపించకపోవడంతో ఆందోళన చెందారు. ఆ తాడు లేకుండా హైకింగ్ చేయడం కష్టం. పైగా చుట్టూ నది. ఇక ఆ సమయంలో ఏం చేయాలో తెలియక ఓ వాటర్ బాటిల్‌లో ఇలా క్యాంప్ గ్రౌండ్‌లో ఇరుక్కున్నామంటూ ఓ కాగితంపై రాసి ఆ వాటర్ బాటిల్‌లో పెట్టి నీళ్లలోకి విసిరేశారు. వాటర్ బాటిల్ వల్ల ఎటువంటి ఉపయోగం కలగలేదనుకుని ఆ ప్రదేశంలోనే నిద్రలోకి జారుకున్నారు. అర్థరాత్రి సమయంలో వారు కునుకు తీస్తుండగా.. పెద్ద పెద్ద శబ్దాలతో అక్కడకు హెలికాప్టర్లలో రెస్క్యూ అధికారులు వచ్చారు. తాము విసిరిన కాగితం అందడం వల్లే అక్కడకు చేరుకున్నామని అధికారులు చెప్పడంతో.. ఆ ముగ్గురి ఆనందానికి అవధుల్లేవు. చావు అంచుల వరకు వెళ్లిన తమను ఆ చిన్న ఐడియా కాపాడిందంటూ వారు మీడియాకు తెలిపారు.

Related posts