telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు సామాజిక

డ్రోన్ కెమెరా వల్ల తప్పిన సొరచేప గండం…!

Fish

సముద్రంలో సర్ఫింగ్ చేస్తున్న సర్ఫర్‌ను సొరచేప బారి నుంచి ఓ డ్రోన్ కెమెరా రక్షించింది. గురువారం ఆస్ట్రేలియాలోని న్యూసౌత్ వేల్స్‌లో ఈ సంఘటన చోటుచేసుకుంది. సముద్రంలోకి దిగిన సర్ఫర్.. సర్ఫింగ్ చేస్తున్న సమయంలో అతడి వైపు పెద్ద సొరచేప రావడానికి ప్రయత్నించింది. అదే సమయంలో అటుగా డ్రోన్ కెమెరాతో ఫొటోలు తీస్తున్న క్రిస్టోఫర్ జాయిస్ అనే డ్రోన్ ఆపరేటర్ ఈ దృశ్యాన్ని డ్రోన్ ద్వారా గమనించాడు. వెంటనే డ్రోన్ స్పీకర్ సిస్టమ్ సహాయంతో సర్ఫర్‌ను ‘సొరచేప.. సొరచేప.. బయటకు వచ్చేయ్’ అంటూ హెచ్చరించాడు. ఇది విన్న సర్ఫర్ వెంటనే నీళ్లలో నుంచి బయటకు వచ్చేశాడు. డ్రోన్ చప్పుడికి సొరచేప కూడా తనకు ప్రమాదం పొంచి ఉందనుకుని వెనక్కు వెళ్లిపోయింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇంతకుముందు డ్రోన్ ద్వారా ఎన్నో సొరచేపలను చూశానని.. కానీ ఓ మనిషి దగ్గరకు సొరచేప రావడం ఇదే మొదటిసారి జరిగిందని డ్రోన్ ఆపరేటర్ చెప్పాడు. వీడియోను గమనిస్తే సొరచేప కనీసం పది నుంచి పదమూడు అడుగులు ఉన్నట్టు కనిపిస్తోంది. తన ప్రాణాలను కాపాడిన డ్రోన్ ఆపరేటర్‌కు సర్ఫర్ ధన్యవాదాలు తెలిపాడు.

Related posts