telugu navyamedia
క్రీడలు వార్తలు

దేశవాళీ క్రికెట్ లోకి శ్రీశాంత్ ఎంట్రీ…

భారత పేసర్ శ్రీశాంత్ 2013 ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో మ్యాచ్ ఫిక్సింగ్ కు పాల్పడ్డాడని బీసీసీఐ అతనికి జీవితకాల నిషేధం విధించింది. అయితే బీసీసీఐ విధించిన జీవితకాల నిషేధాన్ని సుప్రీంకోర్టు ఎత్తివేసింది. తర్వాత ఆ నిషేధాన్ని 7 సంవత్సరాలకు కుదించారు. తాజాగా ఈ ఏడాది సెప్టెంబర్ లో శ్రీశాంత్‌ నిషేధం ముగిసింది. అయితే వచ్చే ఏడాది జనవరి 10 న ప్రారంభం కానున్న ముస్తాక్ అలీ టీ20 టోర్నీ కోసం కేరళ ప్రకటించిన జట్టులో శ్రీశాంత్ పేరు ఉంది. ఇక ఈ జట్టుకు సంజు శాంసన్ న్యాయకత్వం వహించనున్నాడు. అయితే వచ్చే ఏడాది జరగనున్న ఐపీఎల్ వేలంలో తన పేరు ఉంచుతానని శ్రీశాంత్ ఎప్పుడో ప్రకటించాడు. మరి ఇందులో అతడిని ఎవరైనా తీసుకుంటారా… లేదా అనేది తెలియదు. ఇక భారత జట్టు తరపున 27 టెస్టులు, 53 వన్డేలు, 10 టీ 20 లు ఆడిన ఇండియా పేసర్.. చివరిసారిగా 2011 ఆగస్టులో అంతర్జాతీయ క్రికెట్ ఆడాడు. అయితే భారత్ అందుకున్న 2007 టీ20 వరల్డ్‌కప్, 2011 వన్డే ప్రపంచకప్‌ జట్టులో శ్రీశాంత్ సభ్యుడు. మరి ఈ టోర్నీలో శ్రీశాంత్ ఎలా రాణిస్తారు అనేది చూడాలి.

Related posts