లాక్ డౌన్ నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. ఈ బహిరంగ లేఖలో పలు విషయాలను రేవంత్ ప్రస్తావించారు. విపత్కర సమయంలో ప్రభుత్వం సంయమనంతో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. కానీ ప్రభుత్వ అధినేతగా మీరు తీసుకున్న కొన్ని నిర్ణయాలు ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా ఉన్నాయి. బాధ్యత గల ప్రతిపక్షంగా సమయం, సందర్భం దృష్టిలో పెట్టుకొని వాటిని లేవనెత్తకుండా సంయమనం పాటిస్తున్నామని పేర్కొన్నారు.
అధెవిధంగా నాలుగో తరగతి, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతనాల్లో కోత విధించడం సరికాదు. ఉన్నతోద్యోగులను, చిరు ఉద్యోగులను ఒకే గాటన కట్టడం సరైన నిర్ణయం కాదు. ప్రాణాలకు తెగించి విధులు నిర్వహిస్తున్న వైద్య, పారా మెడికల్ సిబ్బందికి తమిళనాడు తరహాలో ప్రోత్సాహాకాలు ఇవ్వాలి. అందుకు విరుద్ధంగా వారి జీతాల్లో కూడా కొత విధించడం నిబద్ధతను తక్కువ చేస్తోంది. ఈ మూడు నిర్ణయాలను పునః సమీక్షించి జనామోద నిర్ణయాలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాను’ అని లేఖ లో పేర్కొన్నారు.