telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సినిమా థియేటర్లకు పూర్వవైభవం..!

Theatre

ఎనిమిదినెలల పాటు థియేటర్లు మూతబడ్డా విషయం తెలిసిందే. వాటి పునరుద్దరణ కోసం ప్రేక్షకులు కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూశారు. ప్రేక్షకులతో పాటు కొందరు హీరోలు కూడా థియేటర్లు తెరుచుకుంటే తమ సినిమాలను విడుదల చేయాలని తహతహలాడుతున్నారు. దాదాపు సినీ పరిశ్రమంతా కొంత కాలంగా వీటి కోసం ఎదురు చూస్తున్నారు. అయితే ఇటీవల ఏఎంబీ చేసిన ప్రకటనతో మల్టీప్లెక్స్‌ వారు నూతనోత్సాహంతో ఉరకలేస్తున్నారు. వాటికి ప్రభుత్వం అంగారం తెలపడంతో ప్రజలు థియేటర్ల కోసం ఎదురుచూపులకు తెరపడే సమయం ఆసన్నమైంది. కోవిడ్ నిబంధనలను ప్రకారం కేవలం 50శాతం మాత్రమే ప్రేక్షకులు హాజరు కావాల్సి ఉంది. అంతేకాకుండా థియేటర్ టికెట్ ధర పెంచుకునే వెసులుబాటు ఉన్నా యాజమాన్యం మాత్రం పాతధరలనే కొనసాగిస్తోంది. థియేటర్లు ఓపెన్ అవుతున్నా ప్రేక్షకుడి స్పందన ఎలా ఉందనేది ప్రదాన చర్చగా మారుతుంది. అయితే ఇప్పుడు మళ్లీ పాత రోజులలాగా థియేటర్లు ప్రజాదరణ పొందుతాయా అనేది చూడాలి. ఇది తెలియాలంటే ఈ రోజు థియేటర్లు తెరుచుకున్న తరువాత పడే మొట్టమొదటి బొమ్మను చూస్తేగాని అర్థం కాదు. మరి ప్రేక్షకులు థియేటర్లపై తమ ప్రమను ఎప్పటిలా చూపుతారా..లేదా అనేది చూడాల్సిందే.

Related posts