telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

అసెంబ్లీలో ఎమోషనలైన సీఎం కేసీఆర్‌

kcr telangana

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు రెండో రోజు ఇవాళ ఉదయం ప్రారంభమయ్యాయి. ఇవాళ సభలో సంతాప తీర్మానాలను సీఎం కేసీఆర్‌ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ భావోద్వేగం అయ్యారు. కరోనా వచ్చి పోయింది… సంతాపం తీర్మానం తాను ప్రవేశ పెట్టడం దురదృష్టకరమన్నారు. నోముల వయసులో తన కంటే చిన్నవాడేనని సీఎం కేసీఆర్‌ తెలిపారు. నోముల తనకు దగ్గరగా ఉండే వారని తెలిపారు సీఎం కేసీఆర్‌. పోరాటాల పురిటగడ్డ… నల్గొండ జిల్లా ముద్దు బిడ్డ నోముల అని కొనియాడారు. విద్యార్థి దశ నుండే పోరాటాల్లో ఉన్నాడని…న్యాయవాదిగా కూడా పేదల పక్షాన నోముల నిలిచారని పేర్కొన్నారు. సభలో చలోక్తులు… తెలంగాణ నుడికారం ఉట్టిపడేలా నోముల ప్రసంగాలు ఉండేవన్నారు. ఈ తరం నాయకులు ఆయన నుండి ఎంతో నేర్చుకోవాల్సి ఉందని.. సీపీఎంకు విశేష సేవలు అందించిన నోముల… ఆ పార్టీ వైఖరికి నిరసనగా.. టీఆర్‌ఎస్‌లో చేరారని తెలిపారు. పేద యాదవ కుటుంబం నుండి వచ్చిన నోముల.. అకాల మరణం తీరని లోటు అని సీఎం కేసీఆర్‌ అభిప్రాయపడ్డారు.

Related posts