telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

నాని టక్ జగదీష్ టీజర్ అప్డేట్..

ప్రస్తుతం టాలీవుడ్ హీరోలు అందరూ వచ్చే రెండు సంవత్సరాలకు సరిపడే సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారు. అందులో నాచురల్ స్టార్ నాని ఒక్కడు. ప్రస్తుతం నాని ”టక్ జగదీష్, అంటే సుందరానికి, శ్యామ్ సింగరాయ్” సినిమాలతో పాటు ఈ ఏడాది చివరికి ఓ వెబ్ సిరీస్ కూడా ప్లాన్ చేస్తున్నాడు.అయితే నాని ఇప్పుడు టక్ జగదీష్ సినిమా చిత్రీకరణలో పాల్గొంటున్నారు. అయితే ఇప్పటికే ఈ సినిమా నుండి వచ్చిన పోస్టర్లు అలాగే ‘ఇంకోసారి.. ఇంకోసారి..’ అనే లిరికల్ వీడియో అందరిని ఆకట్టుకుంది. అయితే వేసవి కానుకగా ఏప్రిల్‌ 23న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా నుండి తాజాగా ఓ అప్డేట్ వచ్చింది. అదేంటంటే… ఈ సినిమా టీజర్ ను ఈ నెల 23న సాయంత్రం 5:04 గంటలకు విడుదల చేయనున్నట్లు తాజాగా చిత్రబృందం ప్రకటించింది. అయితే రీతు వర్మ హీరోయిన్‌గా చేస్తున్న ఈ సినిమా శివ నిర్వానా దర్శకత్వంలో సాహు గారిపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా ఫ్యామిలీ, రొమాన్స్ జానర్స్‌లో తెరకెక్కుతోంది. ఇందులో జగపతి బాబు, రావు రమేష్, నాజర్, ప్రవీన్, ఐశ్వర్య రాజేష్, రోహిని తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Related posts