telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

శ్రీరామ నవమికి ఆదిపురుష్ నుండి గిఫ్ట్ రానుందా…?

Adipurush

ప్రస్తుతం రెబల్ స్టార్ ప్రభాస్ వరుస పాన్ ఇండియా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ప్రభాస్ కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీత్ డైరెక్టన్‌లో తెరకెక్కుతున్న యాక్షన్ మూవీ సలార్‌లో నటిస్తున్న సంగతి తెలసిందే. అంతేకాకుండా ప్రభాస్ బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్ సినిమాను ఓకే చేశారు. ఈ సినిమా చిత్రీకరణ ఇటీవల మొదలైంది. ఆదిపురుష్ సినిమా రామాయణం నేపథ్యంలో తెరకెక్కుతుంది. ఇందులో రావణుడి పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నాడు. ఆదిపురుష్ షూటింగ్‌లో ప్రభాస్ ప్రస్తుతం పాల్గొంటూన్నాడు. అయితే ఇప్పుడు ఈ సినిమా కు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతుంది. ఏ వచ్చే శ్రీరామ నవమికి ఆదిపురుష్ నుండి ప్రవేగస్ ఫస్ట్ లుక్ వస్తుంది అని సమాచారం. అయితే ఈ సినిమాలో కొత్తగా కనిపించేందుకు ప్రభాస్ తన లుక్స్‌లో మార్పు తీసుకురానున్నారని వార్తలు వచ్చాయి. ప్రస్తుతం ప్రభాస్ అభిమానులు ఆదిపరుష్ సినిమాలో ప్రభాస్ లుక్స్ ఎలా ఉండనున్నాయిని ఎదురుచూస్తున్నారు. అయితే దీనికి సంబంధించిన ఎటువంటి అధికారిక ప్రకటన ఇంకా రాలేదు. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది.

Related posts