ఐపీఎల్ 2021 సీజన్‌ను మళ్లీ నిర్వహించేందుకు బీసీసీఐ యూకే ఫస్ట్ చాయిస్ వేదికగా భావిస్తోంది. ఎందుకంటే జూన్ నుంచి సెప్టెంబర్ వరకూ టీమిండియా అక్కడే ఉండనుంది. అలాగే, ఇతర దేశాల ప్లేయర్లను యూకే తీసుకురావడం కూడా సులభం కానుంది. బ్రాడ్‌కాస్టర్ స్టార్‌స్పోర్ట్స్ కూడా సానుకూలంగా ఉంది. అయితే, ఖర్చు ఎక్కువ కావడం ఒక్కటే యూకే విషయంలో ప్రతికూలతగా ఉంది. ‘యూకే ఎప్పుడూ ఖరీదైన ప్రాంతమే. కానీ, అక్కడి గవర్నమెంట్ స్పోర్ట్స్ ఈవెంట్ల కోసం ఫ్యాన్స్‌ను అనుమతిస్తోంది. ఫ్రాంచైజీలకు గేట్ రెవెన్యూ (టిక్కెట్ల డబ్బు) వస్తుంది కాబట్టి ఖర్చులను మేనేజ్ చేసుకోవచ్చు’ అని ఐపీఎల్ వర్గాలు చెబుతున్నాయి. ఒకవేళ జూన్ తర్వాత వరల్డ్‌కప్‌ను ఇండియా బయటకు తీసుకెళ్లాలని బీసీసీఐ నిర్ణయించినా కూడా ఐపీఎల్‌కు ఇంగ్లండ్ ఫస్ట్ చాయిస్ ఆప్షన్‌గా ఉంటుందని చెప్పాయి. ఖర్చులు తగ్గించుకోవాలంటే మాత్రం యూఏఈ సెకండ్ ఆప్షన్‌గా ఉంటుందని, అలాగే, శ్రీలంకలో ఐపీఎల్ నిర్వహించే అవకాశాన్ని కొట్టిపారేయలేమని బోర్డు వర్గాలు అంటున్నాయి. ఐపీఎల్ ఫేజ్-2 కోసం భారత్- ఇంగ్లండ్ మధ్య జరగబోయే ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో మార్పులు జరిగే అవకాశం కనిపిస్తోంది. అవసరమైతే ఈ సిరీస్‌లో మ్యాచ్‌ల సంఖ్యను కుదించే అవకాశం ఉంది. తద్వారా టీ20 ప్రపంచకప్‌నకు ముందే ఐపీఎల్‌ను పూర్తి చేయవచ్చు.
previous post