తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో ఇద్దరు కాంగ్రెసు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో చేరనున్నారు. ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, పినపాక శాసనసభ్యుడు రేగా కాంతారావు ఆదివారం టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకొనున్నారు.అవసరమైతే తమ పదవులకు కూడా రాజీనామా చేస్తామని ఆత్రం సక్కు, రేగా కాంతారావు చెప్పారు. తాము టీఆర్ఎస్ లో చేరుతున్నట్లు వారిద్దరు శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు.
తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య కూడా టీఆర్ఎస్ లో చేరే అవకాశాలున్నాయి. ఆయన శనివారం ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావును కలిశారు. ఈ నేపథ్యంలో కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తీవ్రంగా దెబ్బ తినే అవకాశం ఉంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమకు మద్దతు ఇవ్వాలని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి శనివారం టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడును కోరారు. ఈ మేరకు ఆయన చంద్రబాబుకు ఫోన్ చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఆత్రం సక్కు, రేగ కాంతారావు కాంగ్రెసుకు గట్టి షాక్ ఇచ్చారు.
మేం రాజకీయాలను చచ్చినా వదిలిపెట్టం: నాగబాబు