ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్నది కరోనా వైరస్. కరోనా కారణంగా ఇప్పటికే కోట్లాది మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లక్షల సంఖ్యలో మరణాలు సంభవించాయి. కరోనా మహమ్మారిని ఎదుర్కొనడానికి అనేక ఫార్మా సంస్థలు వ్యాక్సిన్ తయారు చేసే పనిలో ఉన్నాయి. అమెరికాకు చెందిన ఫైజర్, మోడెర్నా, యూకే ఆక్స్ ఫర్డ్, అస్త్రజెనకా, రష్యా స్పుత్నిక్ వి, ఇండియాకు చెందిన భారత్ బయోటెక్, జైడాస్ క్యాడిలా, చైనాకు చెందిన అనేక కంపెనీలు వ్యాక్సిన్ తయారు చేసే పనిలో ఉన్నాయి. కరోనా మహమ్మారికి సమర్ధవంతమైన వ్యాక్సిన్ వస్తేనే కరోనాను అరికట్టగలం. త్వరలోనే వ్యాక్సిన్ రాబోతున్న సమయంలో జపాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోని ప్రజలందరికి ఉచిత వ్యాక్సిన్ అందించాలని నిర్ణయించింది. దీనికి సంబంధించిన బిల్లును ప్రధాని సుగా పార్లమెంట్ లో ప్రవేశపెట్టారు. దీనిపై సుదీర్ఘమైన చర్చ జరిగింది. వ్యాక్సిన్ అందుబాటులోకి రాగానే దేశంలోని ప్రజలందరికి పూర్తి ఉచితంగా వ్యాక్సిన్ అందించబోతున్నారు. మరి ఆ వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది అనేది ఇక చూడాలి.
previous post
తెలంగాణ ఆర్టీసీ సమ్మెపై జేపీ ఆసక్తికర వ్యాఖ్యలు