telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

యూఎస్ ఎన్నికల్లో ఎవరు ఎన్ని రాష్ట్రాల్లో గెలిస్తే అధ్యక్షుడు అవుతారు..?

యూఎస్ ఎన్నికల కౌంటింగ్ ఇంకా కొనసాగుతూనే ఉన్నది.  బ్యాలెట్ పోల్స్ అధికంగా ఉండటంతో వాటిని లెక్కిస్తున్నారు.  అయితే, ఓట్ల లెక్కింపుపై ఇంకా అనిశ్చితి కొనసాగుతోంది.  నెవెడా రాష్ట్రంలో జో బిడెన్ ఆధిక్యంలో ఉండగా, పెన్సిల్వేనియా, జార్జియా, అలాస్కా, నార్త్ కరోలినా రాష్ట్రాల్లో ట్రంప్ ఆధిక్యంలో ఉన్నారు.  అయితే, జార్జియాలో ట్రంప్ ఆధిక్యం స్వల్పంగా ఉన్నది. అటు అరిజోనాలో ఓట్ల లెక్కింపు పూర్తి కాకుండానే జో బైడెన్ గెలిచినట్టుగా ప్రకటించడంతో ట్రంప్ మండిపడ్డారు.  అక్కడ లెక్కించాల్సిన ఓట్లు ఇంకా ఉన్నాయని ట్రంప్ వర్గం కోర్టుకు వెళ్ళింది.  దీంతో ఈ ఫలితాలపై కూడా ఉత్కంఠత నెలకొన్నది.  ఐదు రాష్ట్రాలతో పాటుగా ఆరిజోనా కూడా అధికారికంగా ప్రకటన రావాల్సి ఉండటంతో మొత్తం ఆరు రాష్ట్రాల ఫలితాలు రావాలి. 253 ఓట్లు సాధించిన బైడెన్ రేసులో ఉండాలంటే, పెన్సిల్వేనియాతో పాటుగా మరో రెండు రాష్ట్రాల్లో విజయం సాధించాలి.  ట్రంప్ రేసులో  నిలవాలంటే.. పెన్సిల్వేనియాతో పాటుగా మరో మూడు రాష్ట్రాల్లో తప్పకుండా విజయం సాధించాలి.  ఇక ఇప్పటికే ట్రంప్ అనుకూల వర్గం 44 రాష్ట్రాల కోర్టుల్లో 300 లకు పైగా కేసులను దాఖలు చేసింది.  ఈ కేసులు ఎప్పటికి పరిష్కారం అవుతాయో ఎవరికీ అనుకూలంగా తీర్పులు వస్తాయో చూడాలి మరి.

Related posts