telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు సామాజిక

కల్యాణకట్టను తెరవండి..తిరుమలలో భక్తుల ధర్నా!

TTD Kalyanakatta

పలు ఆంక్షల మధ్య తిరుమలలో శ్రీవారి దర్శనాలు ఎట్టకేలకు ప్రారంభమయ్యాయి. గత రెండు రోజులుగా టీటీడీ అధికారులు, స్థానికులు స్వామిని దర్శించుకుంటున్నారు. భక్తుల ఆరోగ్యం, క్షేమంతో పాటు వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు కేశఖండనశాలలను మూసి వేయాలని టీటీడీ అధికారులు నిర్ణయించారు. వాటిని తక్షణమే తిరిగి తెరిపించాలంటూ భక్తులు ఈ ఉదయం టోల్ గేట్ వద్ద ధర్నాకు దిగడం కలకలం రేపింది.

భక్తులు తమ కోరికలను తీర్చాలంటూ స్వామికి తలనీలాలను భక్తితో సమర్పిస్తారన్న సంగతి తెలిసిందే. భక్తులు సమర్పించే కేశాలతో టీటీడీ కోట్ల రూపాయల ఆదాయాన్ని కూడా పోందుతూవుంది. తాజాగా వాటిని మూసివేయడంతో తమ మనోభావాలు దెబ్బతింటున్నాయని భక్తులు వాపోయారు. తిరుపతిలో ఏర్పాటు చేసే కేంద్రాల ద్వారా రోజుకు 3 వేల దర్శన టికెట్లను ఇస్తామని టీటీడీ వెల్లడించడంతో, ఈ ఉదయం భారీ ఎత్తున భక్తులు టోకెన్ కేంద్రాల వద్దకు చేరారు.

Related posts